Brydon Carse – Gill : ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య బర్మింగ్ హోమ్ లోని ఎడ్జ్ బస్టన్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. రెండో టెస్టులో 92 ఓవర్లకు టీమిండియా 343/5 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శుబ్ మన్ గిల్, జడేజా క్రీజులో ఉన్నారు. గిల్ 125 పరుగులు చేయగా.. జడేజా కూడా 61 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సె శుబ్ మన్ గిల్ పైకి వేలు చూపిస్తూ బౌలింగ్ చేశాడు. అయితే అందుకు గిల్ కౌంటర్ చూస్తే.. ఆశ్యర్యపోవాల్సిందే.
Also Read : Hasin jahan on Shami: ఆ అమ్మాయితో అక్రమ సంబంధం… మహమ్మద్ షమీ ఆత్మహత్యాయత్నం !
గిల్ ని డిస్టర్బ్ చేయడానికి వింత ప్రయత్నం..
టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా కెప్టెన్ గిల్ ను ఔట్ చేయడానికి ఇంగ్లీషు బౌలర్లు తహతహలాడుతున్నారు. అదే సమయంలో గిల్ ఎంతకు ఔట్ కాకపోవడంతో బౌలర్ బ్రైడన్ కార్స్ గిల్ ని డిస్టర్బ్ చేయడానికి వింత చేయడం ప్రారంభించాడు. తొలి ఇన్నింగ్స్ లో 34వ ఓవర్ లో కార్స్ తన రన్ అప్ సమయంలో చేయి పైకెత్తాడు. గిల్ ని దృష్టి మళ్లించడానికి ప్రయత్నించాడు. కానీ గిల్ తెలివిగా క్రీజు నుంచి తప్పుకోవడంతో అఫైర్ దానిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. ఇక అంతకు ముందు మ్యాచ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా యశస్వి జైస్వాల్ ను వెర్బల్ స్లెడ్జింగ్ తో కొట్టడానికి ప్రయత్నించాడు. ముఖ్యంగా శుబ్ మన్ గిల్.. జైస్వాల్ అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 87 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
భారత్ రికార్డు నమోదు చేసేనా..?
ఇక ఆ తరువాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, నితీశ్ కుమార్ ఇద్దరూ ఔట్ అయ్యారు. కేవలం 9 బంతుల వ్యవధిలోనే వీరు ఔట్ కావడం గమనార్హం. టీమిండియా ఆటగాళ్లు తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా రిషబ్ పంత్ తన ఫామ్ కనబరుస్తాడనుకుంటే కాస్త నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి క్లీన్ బౌల్డ్ కావడం గమనార్హం. ప్రస్తుతం శుబ్ మన్ గిల్, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. వీరు కాస్త నిలకడగా రాణిస్తే.. భారత్ భారీ స్కోర్ చేస్తుంది. అలాగే భారీ స్కోర్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ ఆటగాళ్లను కూడా కట్టడి చేస్తేనే టీమిండియా విజయం సాధిస్తుంది. టీమిండియా బ్యాటర్లు ఎంత బాగా బ్యాటింగ్ చేసినప్పటికీ బౌలింగ్ వికెట్లను తీయకపోతే విజయం వరించదనే చెప్పాలి. ఇప్పటివరకు ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించలేదు. అయితే ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే.. శుబ్ మన్ గిల్ కెప్టెన్సీలో రికార్డు నమోదు చేయడం ఖాయం. గిల్ సేన విజయం సాధిస్తుందో.. లేదో అనేది వేచి చూడాలి.