Shirsih Reddy : శిరీష్ రెడ్డి(Shirish Reddy) గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. దిల్ రాజు(Dil Raju) సోదరుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ఈయన సాధారణంగా మీడియా ముందుకు రారు. అయితే దిల్ రాజు నిర్మాణ సంస్థలో నితిన్(Nithin) హీరోగా నటించిన తమ్ముడు(Thammudu) సినిమా ప్రమోషన్లలో భాగంగా శిరీష్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer)సినిమా గురించి మాట్లాడుతూ పొరపాటున నోరు జారారు. సినిమా భారీ నష్టాలను తీసుకొచ్చిందని సినిమా ద్వారా మేము నష్టాలు ఎదుర్కొంటే కనీసం హీరో మాట వరసకు కూడా ఫోన్ చేయలేదని మాట్లాడారు.
క్షమాపణలు చెప్పిన శిరీష్ రెడ్డి..
ఇలా ఈయన ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ మెగా అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా వార్నింగులు కూడా ఇచ్చారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా రామ్ చరణ్ గారిని, మెగా కుటుంబాన్ని కించపరచలేదని పొరపాటున మాట్లాడాను అంటూ శిరీష్ బహిరంగ లేఖ విడుదల చేయటం, అలాగే ఒక వీడియోని విడుదల చేస్తూ క్షమాపణలు కూడా చెప్పారు. దీంతో ఈ వివాదానికి పులిస్టాప్ పడిందని అందరూ భావించారు. ఇక మెగా అభిమానులు కూడా ఈయన క్షమాపణలు చెప్పడంతో కూల్ అవుతూ.. ఇక ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టమని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
చిరంజీవి బ్లాక్ మెయిల్ చేశారు?
ఇలా అంతా సవ్యంగా సాగిపోయింది అనుకుంటున్న తరుణంలో మరొక వీడియో వెలుగులోకి వచ్చింది. శిరీష్ రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కూల్ అయిన మెగా అభిమానులకు ఒక వీడియో మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. శిరీష్ రెడ్డికి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. “చిరంజీవి(Chiranjeevi) నన్ను బ్లాక్ మెయిల్ చేసి అలా క్షమాపణలు చెప్పించారు” అంటూ మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.తాను రాంచరణ్ గురించి మాట్లాడినందుకు మనస్పూర్తిగా క్షమాపణలు చెప్పలేదని, చిరంజీవి బలవంతంగా చెప్పించారన్న ఉద్దేశంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Behind scenes leaked footagepic.twitter.com/zwfJmUWZDA https://t.co/KEaeOBFxyS
— 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤 𝐂𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲🤵♂️ (@_____555KARTHIK) July 2, 2025
ఇకపోతే శిరీష్ ఈ విధంగా మాట్లాడినటువంటి వీడియో నిజమైన వీడియో కాదని, ఇది ఏఐ వీడియో అని స్పష్టమవుతుంది. ఇప్పుడిప్పుడే ఈ వివాదంపై మెగా అభిమానులు కాస్త కూల్ అయ్యారు. ఇలాంటి తరుణంలో ఈ ఏఐ వీడియో ద్వారా మరోసారి ఈ వివాదం మొదటికే వస్తుందని స్పష్టమవుతుంది. అయితే ఈ వీడియో వెనుక మెగా యాంటీ ఫ్యాన్స్ హస్తం ఉంటుందని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీడియోని మెగా అభిమానులు లైట్ తీసుకొని వదిలేస్తారా?లేకపోతే మరోసారి తమ విశ్వరూపం చూపిస్తారా? అనేది తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సంచలనగా మారింది. ఇక దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచుతున్న సమయంలోనే శిరీష్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సినిమాపై కూడా కాస్త ప్రభావం చూపుతుందని నితిన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tollywood Actress: ప్రభాస్ నరకం స్పెల్లింగ్ రాయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి?