E-Paper
Advertisement

కేసీఆర్‌ని తిట్టడం కాదు.. పాలనసై దృష్టి పెట్టు రేవంత్!- చింత ప్రభాకర్

కేసీఆర్‌ని తిట్టడం కాదు.. పాలనసై దృష్టి పెట్టు రేవంత్!- చింత ప్రభాకర్
Advertisement

Chinta Prabhakar: సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పాలనా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం తీవ్ర నష్టపోయిందని, రేవంత్‌రెడ్డి కేవలం ఫ్రస్టేషన్‌తోనే పాలిస్తున్నారని ఆరోపించారు.

అబద్ధాల పాలన.. హామీల మోసం

Advertisement

కాంగ్రెస్‌ను నమ్మి ఒక్కసారి అధికారమిస్తే తెలంగాణ సర్వనాశనమైందని చింత ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఏ జిల్లాలో అడుగుపెట్టినా బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయడం, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప సాధించిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి, పేదలు మరియు గిరిజనులకు చెందిన భూములను గుంజుకోవడమే కాకుండా అమాయకుల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని ధ్వజమెత్తారు.

సిరిసిల్ల నేతన్నల ఇబ్బందులు

Advertisement

ఇటీవల సిరిసిల్ల పర్యటనలో ముఖ్యమంత్రి అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, స్కూల్ యూనిఫామ్స్ ఆర్డర్లతో చేనేత మగ్గాలు ఎప్పుడూ ఆడేవని గుర్తుచేశారు. కానీ నేడు సిరిసిల్లలో మగ్గాలు మూగబోయాయని, ప్రభుత్వ ఆర్డర్లను గుజరాత్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారో రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే చేనేత కార్మికులకు మంచి చేసి ఉంటే పర్యటనకు అంత భారీ పోలీస్ బందోబస్తు ఎందుకని నిలదీశారు.

రాజకీయాలు మాని పాలనపై దృష్టి పెట్టాలి

ఎల్లప్పుడూ కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తూ సమయం వృధా చేయడం కాదని, పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.

Also Read: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై దాడి.. నిందితుడు అదుపులోకి!

Tags

Related News

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. కాంగ్రెస్‌ను ఏకిపారేసిన కేటీఆర్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్!

మియాపూర్ అపార్ట్‌మెంట్‌లో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి!

దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంపై దాడి.. నిందితుడు అదుపులోకి!

కొడంగల్‌లో కాదు.. ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలువు! కేటీఆర్‌కు ఐలయ్య ఓపెన్ ఛాలెంజ్

అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే.. చిన్న కొడుకు కేటీఆర్: అద్దంకి దయాకర్

తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!

అబద్ధాలు నేర్చుకోవాలంటే కేటీఆర్ దగ్గర చేరాల్సిందే! గజ్జెల కాంతం

Big Stories

Advertisement
×