Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమం ఒకటి. ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈ వారానికి సంబంధించి ప్రముఖ సినీనటి సురేఖ వాణి(Surekha Vani) కుమార్తె సుప్రీత(Supritha) హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తన తల్లి సురేఖవాణితో కలిసి సుప్రీత వెకేషన్ వెళ్లడం గురించి ఎన్నో రకాల విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ విమర్శలపై సుప్రీత స్పందించారు. తాను బయటకు ఎక్కడికైనా వెళ్తే మా అమ్మను ఉద్దేశించి కొంతమంది చాలా బాగా విమర్శలు చేశారని తెలిపారు. కనీసం తన కూతురికి సురేఖ వాణి చెప్పలేదా? అంటూ విమర్శించారని ఈమె గుర్తు చేసుకున్నారు అయితే తాను టీనేజ్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే అమ్మ నన్ను కూర్చోబెట్టి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి అనేది చెప్పిందని తెలిపారు. ఇలా ఎవరైతే మమ్మల్ని విమర్శించారో ఇప్పుడు వాళ్ల కూతురు అలా తిరుగుతుంటేనే ఆమె ఏడుస్తుందని, కర్మ ఎవరిని వదలదని సుప్రీత తెలిపారు.
ఇక తల్లి కూతుర్లు ఇద్దరు వెకేషన్ వెళ్లడం గురించి కూడా చాలామంది విమర్శించారు. ఈ విషయం గురించి కూడా సుప్రీత మాట్లాడుతూ.. అమ్మకు ఇప్పుడు 45 నాకు అమ్మకు 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఇక అమ్మ లైఫ్ ఎక్కడ చూసింది.. నాతోపాటు ఆమెను తీసుకెళ్లి తనకు అన్నీ చూపిస్తున్నానని సుప్రీత తెలిపారు. ఇప్పటివరకు అమ్మ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏది అంటూ వర్ష ప్రశ్న వేయడంతో వెంటనే సుప్రీత మాట్లాడుతూ తను నాకు అమ్మగా రావడమే పెద్ద గిఫ్ట్ అని తెలిపారు. ఇక గోవా పర్యటన గురించి ఇంటర్నేషనల్ ట్రిప్స్ గురించి ఈ సందర్భంగా సుప్రీత మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఆస్తులు గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది.
సురేఖ వాణికి గోవాలో విల్లా ఉందని అలాగే ఖరీదైన బెంజ్ రేంజ్ రోవర్ కార్లు కూడా ఉన్నాయి అంటూ వార్తలు వచ్చాయి.. ఈ విషయం గురించి కూడా సుప్రీత మాట్లాడుతూ మేము ఇప్పటికి కూడా సొంత ఇంట్లో లేమని మేముండే ఇల్లు రెంట్ హౌస్ అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీత ఇంకా ఎలాంటి విషయాలు గురించి ప్రస్తావించారనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కాబోతోంది.
Also Read: నాన్న మరణం.. పబ్లిసిటీ కోసమే అంటూ విమర్శలు!