Ranabali Ticket Prices: రణబాలి..రౌడీ ఫాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు మొస్తుందో చెప్పక్కర్లేదు .’టాక్సీవాలా’తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సంకృత్యాన్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రావడం,పైగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. ముఖ్యంగా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్నారనే టాక్ రావడంతో సినిమా ఎలా ఉండబోతుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారంతా .
అయితే సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ‘రణబాలి’కి సంబంధించిన పలు క్రేజీ అప్ డేట్స్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే సినిమా రిలీజ్ ముందుగా టాక్ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టికెట్ రేట్లను పెంచుకునేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరిగింది. దీంతో సినిమా టికెట్ ధరలపై సోషల్ మీడియాలో తెగ డిబేట్లు పెట్టేశారు నెటిజన్లు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ఏపీలో టికెట్ రేట్లకు హైక్ ఉంటుందేమోనని అనుకున్నారంతా పైగా ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ ధరలు పెంచడం చాలా కామన్ అయిపొయింది కూడా. ముఖ్యంగా భారీ ఓపెనింగ్స్‌పై నమ్మకం ఉన్న సినిమాలకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు టికెట్ రేట్లు పెంచుమన్న సందర్భాలు బోలెడు.. దీంతో ‘రణబాలి’ విషయంలో కూడా అలాంటి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగింది.
కానీ ఇప్పుడు ఈ ప్రచారానికి మైత్రి మూవీ మేకర్స్ స్వయంగా చెక్ పెట్టినట్టైంది. ‘రణబాలి’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టికెట్ రేట్ల పెంపు కోసం ఎలాంటి హైక్స్‌కు అప్లై చేయలేదని స్పష్టం చేశారు. దీంతో ఏపీలో రేట్లు పెరగబోతున్నాయంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసినట్టు అయింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సినిమా మీద తమకు పూర్తి నమ్మకం ఉందని మేకర్స్ చెబుతున్నారు. ప్రేక్షకులు సినిమాను కంటెంట్ ఆధారంగా ఆదరిస్తారనే నమ్మకంతోనే సాధారణ ధరలకే ‘రణబాలి’ని తీసుకొస్తున్నామని చెప్పడం ఇప్పుడు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోందని చెప్పాలి.. టికెట్ రేట్లు పెంచకుండా కూడా భారీ ఓపెనింగ్స్ సాధించగలమనే కాన్ఫిడెన్స్ నిర్మాతల్లో ఉండటం బట్టి చూస్తే సినిమా ఏ రేంజ్ లో సాటిస్పై చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే. దసరా సీజన్‌కు దగ్గరగా సినిమా వస్తుండటంతో కలెక్షన్స్ పై కూడా దీని ఎఫెక్ట్ సాలిడ్ గానే పడే అవకాశం కనిపిస్తుంది.చూడాలి మరి టికెట్ రేట్లు పెంచమని క్లారిటీ ఇచ్చిన మేకర్స్ కి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అనుభవం ఎదురవుతుందో !’
ALSO READ:‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!