E-Paper
Advertisement

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!
Advertisement

Riddhi Kumar:రిధి కుమార్..తెలుగు ఆడియన్స్ కి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు .మోడలింగ్‌ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగు, హిందీ, మలయాళం, మరాఠీ ఇండస్ట్రీల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే .ఇక ఒకవైపు సినిమాలతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ మరోవైపు సోషల్ మీడియాలో వరుస అప్ డేట్స్ తో ఫాలోవర్స్ ని ఫిదా చేస్తూనే ఉంటుంది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.”Pixie Dreamgirl living in a Pixie Dreamworld” అంటూ పెట్టిన క్యాప్షన్‌కు తగ్గట్టుగానే.. ఈ ఫోటోల్లో రిధి కుమార్ చాలా క్యూట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుండటంతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాన్స్ .

Advertisement

ప్రకృతి మధ్యలో పింక్, రెడ్ షేడ్స్ కలిసిన డ్రెస్‌లో కనిపించిన రిధి.. చాలా సింపుల్‌గా పోజులివ్వడంతో ఇది కదా మా రిధి సింప్లిసిటీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారూ ఫాలోవర్స్ . ఇందులో చుట్టూ పచ్చని మొక్కలు, వెనుక అందమైన బిల్డింగ్.. మధ్యలో రిధి కుమార్ లుక్ ఫోటోకు మరింత గ్లామర్ తీసుకొచ్చాయనడంలో సందేహం లేదు.

ముఖ్యంగా ఆమె హెయిర్ స్టైల్, స్మైల్, డ్రెస్ కలర్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి . నిజానికి సినిమాల్లో గ్లామర్‌తో కనిపించే హీరోయిన్లు సోషల్ మీడియాలో మాత్రం చాలా క్యాజువల్‌గా కనిపించడం ఇప్పుడు కామన్ అయిపోయింది. రిధి కుమార్ కూడా అదే స్టైల్‌ను ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది. త అందుకే ఈ ఫోటోలు అభిమానులకి పిచ్చ పిచ్చగా నచ్చేస్తున్నాయి.

Advertisement

రిధి కుమార్ సినిమా కెరీర్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన ‘లవర్’సినిమాతో 2018లో హీరోయిన్‌గా. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత అదే ఏడాది ‘అనగనగా ఓ ప్రేమకథ’లోనూ కనిపించిన ఈ భామ ఒక్క ఇండస్ట్రీకే పరిమితం కాకుండా మలయాళం, మరాఠీ, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల వైపు కూడా అడుగులు వేయడం విశేషం.

ఇక మలయాళంలో ‘ప్రణయ మీనుకలుడే కడల్’ సినిమాలో జాస్మిన్ పాత్రలో నటించింది. మరాఠీలో ‘దండం’తో అక్కడ కూడా తన మార్క్ చూపించింది. అయితే ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’*సినిమాతో రిధికి మరింత గుర్తింపు వచ్చిందని చెప్పాలి . ఈ సినిమాలో ఆమె ‘తారా’ పాత్రలో కనిపించింది.

అంతేకాదు.. సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్‌లోనూ రిధి కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం విశేషం.క్యాండీ ,హ్యూమన్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది.ముఖ్యంగా ‘క్యాండీలో కల్కి రావత్ పాత్ర, ‘హ్యూమన్ ’లో దీపాలి పాత్ర, ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.ఇక ఈ మధ్య సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ లో మల్లిక పాత్రలో మెప్పించి మంచి పేరు తెచ్చుకుంది .

అయితే అన్నింటి కన్నా మించి రిధి కుమార్‌కు మరోసారి హైప్ తీసుకొచ్చిన సినిమా మాత్రం ‘ది రాజాసాబ్’అనే చెప్పాలి .. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రిధి కుమార్ ‘అనిత’ పాత్రలో కనిపించి మంచి మార్కులే కొట్టేసింది .అయితే సినిమా డిజాస్టర్ టాక్ మూట గట్టుకోవడం ఈ అమ్మడి బ్యాడ్ లాక్ అని చెప్పాలి.

ALSO READ:నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

మొత్తానికి ఒక వైపు సినిమాలతో పర్లేదనిపిస్తున్న ఈ భామ ఇదిగో ఇలా తన ఫ్యాషన్, ట్రావెల్, ఫోటోషూట్‌లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంది.

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×