Ranveer Singh: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రణవీర్ సింగ్ (Ranveer Singh)ఒకరు. ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఇతనికి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో భాగంగా ఒక అభిమానికి ఈయన పాదాభివందనం చేయడంతో అభిమానులు ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. అసలు రణబీర్ సింగ్ అభిమాని కాళ్లు మొక్కడం ఏంటి? అసలేం జరిగింది? అనే విషయానికి వస్తే… ప్రస్తుతం ఈయన తన సినిమా డబ్బింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక డబ్బింగ్ స్టూడియో(Dubbing Studio)లో డబ్బింగ్ చెబుతున్నటువంటి రణవీర్ కోసం కొంతమంది అభిమానులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు.
అభిమాని ఆశీర్వాదాలు..
ఇకపోతే ఈ స్టూడియో ఆవరణంలో ఒక అభిమాని గంటల తరబడి తనకోసం ఎదురు చూడటాన్ని రణ వీర్ సింగ్ గమనించారు. ఈ క్రమంలోనే ఆయన స్టూడియో నుంచి బయటకు రావడంతో సదరు అభిమానితో మాట్లాడి తన పాదాలను తాకి ఆశీర్వాదాలను కూడా తీసుకున్నారు. ఇక ఆ మహిళ రణవీర్ సింగ్ కంటే కూడా వయసులో పెద్దది కావడంతో ఈయన తన ఆశీర్వాదాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో రణవీర్ సింగ్ సింప్లిసిటీ పై ఆయన మంచి మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
దురంధర్ పనులలో రణవీర్ సింగ్..
ఇక ఈ వీడియో పై అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి గొప్ప మనసు అందరికీ ఉండదని ఈయన చేసిన పనికి ప్రశంసిస్తున్నారు. ఇకపోతే రణవీర్ సింగ్ ప్రస్తుతం దురంధర్(Dhurandhar) సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ సినిమా యాక్షన్ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం ఇందులో రణవీర్ సింగ్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి రణవీర్ కు సంబంధించిన పస్ట్ లుక్ విడుదల కావడంతో సినిమాపై కూడా మంచి అంచనాలను పెంచేసింది.
?igsh=MXhoYXZiYmpjOWQwNQ%3D%3D
ఇక రణవీర్ వృత్తిపరమైన విషయం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన బాలీవుడ్ నటి దీపికా పదుకొనే(Deepika Padukone)ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు గత ఏడాది సెప్టెంబర్ లో పండంటి ఆడబిడ్డ జన్మించారు . ఈ చిన్నారికి దువా పదుకొనే అని నామకరణం చేశారు. అయితే ఇప్పటివరకు ఈ చిన్నారి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలను మాత్రం అభిమానులకు తెలియజేయలేదు. దీపికా పదుకొనే కూడా ప్రస్తుతం సినిమాల పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఈమె అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనులలో దీపికా పదుకొనే బిజీగా ఉన్నారు. ఇక ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Bunny Vasu: ఇండస్ట్రీకి ఇలాంటివి కొత్త ఏం కాదు.. సమ్మెపై క్లారిటీ ఇచ్చిన బన్నివాసు!