BigTV English

Bunny Vasu: ఇండస్ట్రీకి ఇలాంటివి కొత్త ఏం కాదు.. సమ్మెపై క్లారిటీ ఇచ్చిన బన్నివాసు!

Bunny Vasu: ఇండస్ట్రీకి ఇలాంటివి కొత్త ఏం కాదు.. సమ్మెపై క్లారిటీ ఇచ్చిన బన్నివాసు!

Bunny Vasu: ఇండస్ట్రీలో కార్మికులు నిర్వహిస్తున్నటువంటి నిరసనలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. తమకు తప్పనిసరిగా 30% వేతనాలు పెంచాలి అంటూ కార్మికులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై సినీ నిర్మాతలు కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుపుతూ సరైన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. తాజాగా ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అయ్యారు. ఈ కమిటీలో భాగంగా ఫెడరేషన్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఇక కార్మికుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఈ సమావేశం ముగియడంతో రెండు వైపుల నుంచి పెద్ద ఎత్తున వారి సమస్యలపై అలాగే పరిష్కారాల కోసం చర్చలు జరిగినట్టు సమాచారం.


తెలుగు సినిమాలకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు..

ఈ క్రమంలోనే ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు (Bunny Vasu)కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితం కాలేదని ఇంటర్నేషనల్ స్థాయిలో మన సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటున్నాయని తెలిపారు. ఇలా మన సినిమాలకు ఇంటర్నేషనల్ స్థాయిలో క్రెడిట్ రావడంతోనే అదే రేంజ్ లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్ లతో పని చేస్తున్నప్పుడు మనం కూడా వారికి కోపరేట్ చేస్తే భవిష్యత్తులో మనకు ఆ స్కిల్స్ వస్తాయని తెలిపారు.


తుది దశకు చేరుకున్న కార్మికుల సమస్య…

ఇక ఇండస్ట్రీకి ఈ విధమైనటువంటి సమస్య రావటం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలాంటి ఇబ్బందులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సినీ వర్కర్ల(Cine Workers) నుంచి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి కానీ ఈసారి మాత్రం స్ట్రైక్ రేషియో చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఇప్పటికే ఫెడరేషన్ , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యుల నుంచి కూడా వారి వారి అభిప్రాయాలను తెలియజేశారు. దాదాపు ఈ సమస్య తుది దశకు చేరుకుందని మరొక రెండు మూడు రోజులలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని బన్నీ వాసు తెలిపారు.

జోక్యం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం…

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఇలాంటి సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది సినిమాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా రావడంతో బన్నీ వాసు వాటిని ఖండించారు. ఎవరు కూడా సినిమా షూటింగ్స్ జరపలేదని, అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా షూటింగ్ జరుపుతున్నారంటే వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అయి ఉంటారని బన్నీవాసు ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈయన చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే కార్మికుల సమస్యకు త్వరలోనే పరిష్కారం రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేస్తుందని స్పష్టం అవుతుంది. మరి కార్మికుల అనుకున్న విధంగానే 30% వేతనాలను దక్కించుకుంటారా? లేదా ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యుల నిర్ణయం మేరకు తిరిగి సినిమాలో షూటింగ్ పనులలో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Prabhas Spirit: ప్రభాస్ తో నటించాలని ఉందా? సూపర్ ఛాన్స్ ఇచ్చిన స్పిరిట్ టీమ్..ఇలా చేసేయండి!

Related News

Ranveer Singh: అభిమాని కాళ్లు మొక్కిన స్టార్ హీరో.. సింప్లిసిటీకి ఫిదా అవ్వాల్సిందే!

Prabhas Spirit: ప్రభాస్ తో నటించాలని ఉందా? సూపర్ ఛాన్స్ ఇచ్చిన స్పిరిట్ టీమ్..ఇలా చేసేయండి!

Saiyaara: ఇదెక్కడి విడ్డూరం సామీ… సినిమా చూస్తూ ఏడవలేదని అరెస్ట్..రూ. 2లక్షల ఫైన్!

Telugu film industry: టాలీవుడ్ వివాదం… రంగంలోకి ప్రభుత్వం.. సోమవారం నుంచి షూటింగ్ స్టార్ట్?

Hrithik Roshan: గ్రీస్‌లో గ్రీక్ గాడ్‌ను గుర్తుపట్టలేదట… పాపం హృతిక్‌ని ఇన్ని రోజులు మోసం చేశారా ?

Big Stories

×