Rashmika Mandanna: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఒకరు. ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు కానీ కన్నడలో నటించిన ఒక్క సినిమానే అయినా, తెలుగు భాషలో మాత్రం అద్భుతమైన సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ అవకాశాలను కూడా అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఇటీవల వరుస హిట్ సినిమాలతో రష్మిక ఫుల్ జోష్ లో ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
ఇటీవల రష్మిక నటించిన యానిమల్ , పుష్ప 2, ఛావా, కుబేర వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేర(Kuberaa) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మిక “మైసా” అనే కొత్త సినిమాని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా” వి ద ఉమెన్” (ఈ The Women)అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ధూమపానం(Smoking) గురించి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాను వదులుకోవడానికి కూడా సిద్ధమే…
వ్యక్తిగతంగా తాను ధూమపానం వంటి వాటిని అసలు ప్రోత్సహించని తెలిపారు. అలాంటి సన్నివేశాలలో నటించడానికి కూడా నేను ఏమాత్రం ఆసక్తి చూపనని ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. అయితే పాత్ర అనుగుణంగా కథ డిమాండ్ చేస్తూ అలాంటి సన్నివేశాలలో నటించమని ఎవరైనా కోరితే ఆ సినిమానే వదులుకుంటాను తప్పా, ధూమపానం వంటి వాటిని అసలు ప్రోత్సహించనని రష్మిక తెలిపారు. ఇలా ధూమపానానికి వ్యతిరేకంగా ఈమె మాట్లాడటమే కాకుండా అవసరమైతే సినిమాలను కూడా వదులుకుంటానని చెప్పడంతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీల ప్రవర్తన ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పాలి.
విజయ్ దేవరకొండతో రిలేషన్..
ఇలా ఎంతో గుర్తింపు పొందిన సెలబ్రిటీలు నడవడిక సరైనది ఉంటే అభిమానులు కూడా వారి నుంచి అదే అనుసరిస్తుంటారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు ఇలా హానికరమైనటువంటి విషయాల గురించి ప్రోత్సహించడానికి ఇష్టపడరు. అలాగే కొన్ని హానికరమైనటువంటి బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మిక కూడా ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిసి అభిమానులు ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక వ్యక్తిగత విషయాలలో కూడా తరచు వార్తలు నిలుస్తుంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఈమె రిలేషన్ గురించి తరచు వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కానీ, ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టడం లేదనే చెప్పాలి.
Also Read: Kannappa Fan :మంచు మావయ్యా.. ‘కన్నప్ప’ సినిమాకు చూస్తానంటూ చిన్నారి పేచీ, విష్ణు స్పందన ఇదే