HHVM Trailer: మెగా అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఎంతగానో ఎదురు చూసిన ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ డేట్ మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ డేట్ తో పాటు ఏ ఏ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారో కూడా తాజాగా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఈ సినిమాను నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఇంస్టాగ్రామ్ అధికారిక ఖాతా ద్వారా పోస్టర్ రూపంలో ఈ విషయాన్ని పంచుకుంది. మరి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? ఏ ఏ థియేటర్లలో విడుదల చేయనున్నారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
నాలుగేళ్ల ఎదురుచూపుకు తెర లేపిన యూనిట్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, జ్యోతి కృష్ణ (Jyoti Krishna)దర్శకత్వంలో వస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. ప్రముఖ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా 2021లోనే ప్రారంభం అయింది. కానీ ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) తప్పుకోవడంతో రంగంలోకి దిగిన జ్యోతి కృష్ణ పవన్ కళ్యాణ్ డేట్స్ కు అనుగుణంగా షూటింగ్ ను ఇన్నాళ్లకు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారు అంటే.. ఇక ఈ సినిమా టికెట్ కౌంటర్ ఓపెన్ చేయడం ఆలస్యం వెంటనే ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎదురుచూపు మధ్య తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను విడుదల చేశారు మేకర్స్.
హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ ఆరోజే..
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా థియేట్రికల్ ట్రైలర్ జూలై 3వ తేదీన ఉదయం 11:10 గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు సీడెడ్ థియేటర్ల జాబితాను మేకర్స్ ప్రకటించారు.
సీడెడ్ స్క్రీనింగ్ థియేటర్ లిస్ట్..
తిరుపతి – NVR జయ శ్యామ్ థియేటర్
అనంతపూర్ – త్రివేణి థియేటర్
చిత్తూరు -విజయలక్ష్మి థియేటర్
కడప -రాజా థియేటర్
కర్నూలు -ఆనంద్ కాంప్లెక్స్
గుంతకల్ -వాసవి థియేటర్
ప్రొద్దుటూరు -చాంద్ థియేటర్
నంద్యాల – శ్రీరామ అండ్ రఘురామ థియేటర్ లలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
ఒక పవన్ కళ్యాణ్ ఒకవైపు స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకొని.. మరొకవైపు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఇలా బిజీ షెడ్యూల్ తో కొనసాగుతున్న ఈయన.. ఇప్పుడు అభిమానులను సంబరపరచడానికి తన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే హరిహర వీరమల్లు సినిమాను విడుదలకు సిద్ధం చేశారు. మరొకవైపు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. అంతే కాదు ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
also read:Janhvi kapoor: మీడియాపై జాన్వీ కపూర్ మండిపాటు.. మానవత్వం కూడా లేదంటూ!