E-Paper
Advertisement

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!
Advertisement

CNG Car Safety Alert: గుజరాత్‌ లోని వడోదర జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన CNG వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కర్జాన్ సమీపంలోని జాతీయ రహదారి 48పై ఉన్న CNG స్టేషన్‌లో ఇంధనం నింపుతున్న సమయంలో ఓ CNG కారు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పేలుడు ధాటికి కారు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు, సమీపంలో ఉన్న మరో రెండు వాహనాలు, CNG స్టేషన్‌కు చెందిన కొన్ని పరికరాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

అసలు ఏం జరిగింది?

కర్జాన్ సమీపంలోని ఓ CNG స్టేషన్‌లో మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కారు CNG నింపుకుంటుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కారులోని CNG సిలిండర్ లేదంటే దానికి సంబంధించిన వ్యవస్థలో సమస్య తలెత్తి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పేలుడు తర్వాత కారు వెనుక భాగం భారీగా దెబ్బతింది. అద్దాలు, వాహనంలోని కొన్ని భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. స్టేషన్ దగ్గర ఉన్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. కారులో ఉన్న డ్రైవర్ కూడా ఆ సమయంలో వాహనం నుంచి దూరంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, CNG వాహనదారులు  గ్యాస్ నింపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

గ్యాస్ నింపేటప్పుడు కారులో నుంచి బయటకు రండి!

Advertisement

CNG నింపే సమయంలో డ్రైవర్‌తో పాటు ప్రయాణికులు కూడా వాహనం నుంచి బయటకు వచ్చి సురక్షిత దూరంలో ఉండటం మంచిది. వడోదర ఘటనలో వాహనం చుట్టూ ఉన్నవారు దూరంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది.

సిలిండర్, వాల్వ్‌ లను చెక్ చేయించండి!

CNG సిలిండర్, వాల్వ్, పైపింగ్, కిట్ లాంటి భాగాలను గుర్తింపు పొందిన నిపుణులతో ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలి. తుప్పు, పగుళ్లు, అరుగుదల, గ్యాస్ లీక్‌ కి సంబంధించిన అనుమానం కనిపిస్తే వెంటనే వాహనాన్ని రిపేర్ చేయించడం మంచిది.

అనధికారిక మార్పులు చేయవద్దు!

Advertisement

CNG వ్యవస్థలో స్వయంగా మార్పులు చేయడం, నాణ్యత లేని, ధృవీకరణ లేని విడిభాగాలను ఉపయోగించడం ప్రమాదకరం. CNG కిట్‌కు సంబంధించిన మరమ్మతులు, మార్పులు గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులతోనే చేయించుకోవాలి.

చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం!

దేశంలో CNG వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు వాహన భద్రతపై మరోసారి దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. CNG వాహనం కావడం వల్ల భయపడాల్సిన అవసరం లేకపోయినా, సిలిండర్, కిట్, వాల్వ్‌ లు, పైపింగ్ లాంటి కీలక భాగాల నిర్వహణలో నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా CNG నింపే సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం, వాహనాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేయించడం చాలా అవసరం. వడోదర ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

Tags

Related News

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×