E-Paper
Advertisement

అరాచకం సృష్టిస్తున్న శర్వానంద్.. ‘భోగి’ టీజర్ ఎలా ఉందంటే?

అరాచకం సృష్టిస్తున్న శర్వానంద్.. ‘భోగి’ టీజర్ ఎలా ఉందంటే?
Advertisement

Bhogi Movie Teaser:ఛార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand) ప్రధాన పాత్రలో.. మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో నవంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భోగి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పక్కా మాస్ అంశాలతో కూడిన ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త పాత్రలో శర్వానంద్ దర్శనమిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కేకే రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒకవైపు శరవేగంగా జరుగుతోంది. మరొకవైపు అభిమానులలో ఇటు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని పెంచడానికి చిత్ర బృందం ఒక్కో అప్డేట్ వదులుతోంది.

భోగి మూవీ నుండి టీజర్ రిలీజ్..

ఈ మేరకు భోగి సినిమా నుండి 1:45 నిమిషాల నిడివితో టీజర్ ను విడుదల చేశారు. రా అండ్ రస్టిక్, ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా శర్వానంద్ కెరియర్ లోనే ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలవబోతోందని చెప్పవచ్చు. శర్వానంద్ ఇందులో గంగ అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా ఒక విభిన్నమైన పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. ఇందులో రక్తం మడుగుల్లో శర్వానంద్ కనిపించిన తీరు సినిమాపై అంచనాలను పెంచేసింది.

టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

ఎక్కువగా క్లాస్ , ఫ్యామిలీ రోల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ ఈ సినిమాలో ఒక పూర్తి భిన్నమైన మాస్ షేడ్స్ లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. యాక్షన్ పర్ఫార్మెన్స్, రస్టిక్ లుక్ టీజర్ కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. టీజర్ ప్రారంభంలోనే రక్తం మడుగుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా గంగా పాత్రలో ఉన్న శర్వానంద్ ను చూపించారు.” చచ్చిన మా అమ్మానాన్నల మీద ఒట్టు.. ఆ తొమ్మిది మెట్లను నా కత్తితో కడిగి మీ నెత్తుటితో అలకకపోతే.. నేను కమ్మరోళ్ల గంగనే కాదురా” అంటూ శర్వానంద్ చెప్పే డైలాగు గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

శర్వానంద్ కెరియర్ లోనే ప్రత్యేకమైన చిత్రం..

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో అనుపమ డీ గ్లామరస్ రోల్ కూడా సినిమాకు మరింత ఆకర్షణగా నిలవనుంది.ఇకపోతే ఇందులో అనుపమాతో పాటు డింపుల్ హయతి కూడా కీలకపాత్ర పోషిస్తుంది. భీమ్స్ సిసి రోలియో అందిస్తున్న సంగీతం సినిమాకు మరింత ఆకర్షణగా నిలవనుంది. ఏది ఏమైనా తన కెరియర్లో తొలిసారి మాస్ రస్టిక్ లుక్కుతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైన శర్వానంద్.. ఈ సినిమాతో రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

భోగి మూవీ తారాగణం..

భోగి సినిమా తారాగణం విషయానికి వస్తే.. కందుల సులోచన రాణిలా అనుపమ పరమేశ్వరన్ , గంగ పాత్రలో శర్వానంద్ నటిస్తున్నారు. డింపుల్ హయతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దయానంద రెడ్డి, లాల్, రోహిత్ పాఠక్ లాంటి సెలబ్రిటీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related News

ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?

రాకా కోసం అల్లు అర్జున్ తీసుకుంటుంది ఎంతో తెలుసా?

ఉదయపూర్ లో రష్మికతో పెళ్లి..10 రోజులు పాటు ఏడ్చిన విజయ్ తల్లి..ఎందుకంటే?

రాకా తరువాత అట్లీ సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారా?

ఇరుముడి డైరెక్టర్‌తో ఈసారి జత కట్టేదెవరో?

సింగీతం శ్రీనివాసరావు చివరి కోరిక అదేనా?నెరవేరకుండానే కన్నుమూశారా?

సోషల్ మీడియాకు ఆధార్ లింక్.. చుట్టమల్లే వివాదంపై రామ్ రియాక్షన్!

లైగర్ డిజాస్టర్ పై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన విజయ్..చాలా కష్టపడ్డాను కానీ?

Big Stories

Advertisement
×