E-Paper
Advertisement

Rashmika: ఆ దివంగత నటి బయోపిక్ లో నేషనల్ క్రష్.. రష్మిక రిస్క్ చేస్తుందా?

Rashmika: ఆ దివంగత నటి బయోపిక్ లో నేషనల్ క్రష్.. రష్మిక రిస్క్ చేస్తుందా?
Advertisement

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2025వ సంవత్సరంలో ఏకంగా ఐదు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఏకంగా నాలుగు సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది కూడా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉండగా మరికొన్ని సినిమాలకు కమిట్ అవుతూ రష్మిక కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

భీష్మ డైరెక్టర్ తో రష్మిక?

రష్మికకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం మైసా, కాంచన 4 వంటి సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది అయితే ఈమె దర్శకుడు వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారని, ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటి బయోపిక్ సినిమా కావటం విశేషం.. ఇటీవల కాలంలో క్రీడా రంగానికి, రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రత్యూష బయోపిక్ సినిమాలో రష్మిక..

Advertisement

ఈ నేపథ్యంలోనే రష్మిక దివంగత హీరోయిన్ బయోపిక్ సినిమాలో చేయబోతున్నారని ఇప్పటికే ఈ సినిమా కథ విన్న రష్మిక దాదాపు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. మరి రష్మిక చేయబోతున్న ఆ బయోపిక్ సినిమా ఎవరిది అనే విషయానిక వస్తే ఆమె మరెవరో కాదు నటి ప్రత్యూష(pratyusha) అని తెలుస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించిన ప్రత్యూష 2002వ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకునే మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈమె మరణం టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది. ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించిన ప్రత్యూష బయోపిక్ లో రష్మిక నటించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇప్పుడు ఈ రిస్క్ అవసరమా?

Advertisement

రష్మిక ప్రత్యూష బయోపిక్ సినిమాలో నటిస్తే బానే ఉంటుంది అంటూ కొంతమంది ఈ వార్తలపై స్పందించగా మరికొందరు మాత్రం ఈమె బయోపిక్ సినిమాలో నటించి రష్మిక ఏమైనా రిస్క్ చేస్తుందా? తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయత్నాలు అవసరమా? అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి రష్మిక గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది . ఇదివరకు రష్మిక వెంకీ కుడుముల కాంబినేషన్లో భీష్మ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మరోసారి వెంకీ కుడుముల డైరెక్షన్లో రష్మిక చేయటానికి సిద్ధమైనట్టు సమాచారం.

Also Read: Rithu Chowdary: ధర్మా మహేష్ తో రీతూ.. సీసీటీవీ పుటేజ్ పై రియాక్ట్ అయిన రీతూ!

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×