Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా గడుపుతూనే మరోవైపు ఇతర సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే రష్మిక నటించిన రణబాలి (Ranabaali)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో విజయ్, రష్మిక ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూలో భాగంగా సుమ రష్మికను ప్రశ్నిస్తూ అసలు రణబాలి సినిమాలో మీరు నటించడానికి ప్రధాన కారణం ఏంటి? హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) అని ఓకే చేశారా? లేదంటే జయమ్మ పాత్ర(Jayamma Role) చూసి ఓకే చేశారా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు రష్మిక మందన్న సమాధానం చెబుతూ.. తాను ఎప్పటినుంచో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityn)దర్శకత్వంలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. రాహుల్ బెస్ట్ ఫిలిం మేకర్ ఆయనతో పని చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను అనుకోకుండా రణబాలి సినిమాలో అవకాశం వచ్చింది.
ఇక ఈ సినిమాలో జయమ్మ పాత్ర కూడా తనకు చాలా అద్భుతంగా నచ్చిందని రష్మిక తెలిపారు. కేవలం జయమ్మ పాత్ర మాత్రమే కాకుండా సినిమా కథ మొత్తం తనకు నచ్చిందని అందుకే రణబాలి సినిమాకు ఓకే చేశానని రష్మిక తెలిపారు. విజయ్ దేవరకొండతో ఈ సినిమాలో నటించడం గురించి కూడా మాట్లాడుతూ మేమిద్దరం కలిసి సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది. తిరిగి మేమిద్దరం ఏదైనా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే రణబాలి లాంటి కథ కరెక్ట్ అనిపించింది. అందుకే ఈ సినిమాకు ఓకే చేశానని రష్మిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ రష్మిక జంటగా గీతగోవిందం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అనంతరం వీరిద్దరూ జంటగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా అనంతరం విజయ్ రష్మిక తదుపరి ఎలాంటి సినిమాలలో నటించలేదు. చాలా రోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రణబాలి సినిమా రాబోతోంది. బ్రిటిష్ పాలన వ్యతిరేక నేపథ్యంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ప్రజల కోసం పోరాడే యోధుడు సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మాత్రం సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయ.
Also Read: బిగ్ బాస్ నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!