E-Paper
Advertisement

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!

ఏళ్ల తరబడి సాగిన ఎస్‌ఎల్‌బీసీ కష్టాలకు ఎండ్ కార్డ్.. మంత్రి ఉత్తం అల్టిమేటం!
Advertisement

SLBC Tunnel: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనుల్లో అత్యంత క్లిష్టమైన భూగర్భ పరిస్థితులను అధిగమించి కీలక ముందడుగు వేశామని మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. అదనపు యంత్రాలను రంగంలోకి దించి, తవ్విన రాళ్లు, మట్టిని బయటకు తరలించే వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగంతోపాటు కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టుల అమలుపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో మంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు.

30 టీఎంసీలకు పైగా..

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, అదనపు యంత్రాల వినియోగంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాంతంలోని మెట్ట ప్రాంతాలకు 30 టీఎంసీలకు పైగా నీటిని అందించి, ఏళ్ల తరబడి వేధిస్తున్న నీటి కొరతను తీర్చాలన్నదే లక్ష్యమని తెలిపారు. 2028 జూన్‌ నాటికి నీటిని అందించేందుకు పక్కా కార్యాచరణ రూపొందించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Advertisement

Also read: ‘పుష్పక విమానం’ వెనుక సింగీతం అసలైన ఛాలెంజ్?

అక్టోబర్‌ లేదా నవంబర్‌..

జర్మనీ నుంచి తెప్పిస్తున్న రైలు ఇంజిన్‌ (లోకోమోటివ్‌) అక్టోబర్‌ నెలాఖరుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని వినియోగంతో తవ్విన రాళ్లు, మట్టిని వేగంగా బయటకు తరలించవచ్చని, తద్వారా ఒక్కో దఫా పనికి పట్టే సమయం తగ్గుతుందని వివరించారు. సొరంగంలో 21 కిలోమీటర్ల వరకు దూరం నుంచి తవ్విన పదార్థాలను తరలించాల్సి రావడం ప్రధాన అవరోధంగా ఉందన్నారు.తరలింపు ఆలస్యమైతే రాళ్లు, మట్టి లోపల పేరుకుపోయి, వాటిని తొలగించే వరకు తవ్వకాలు నిలిపివేయాల్సి వస్తోందని తెలిపారు. అక్టోబర్‌ చివరి లేదా నవంబర్‌ ప్రారంభం నుంచి పనుల వేగం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

స్ప్రే లైనింగ్‌ పనులు..

Advertisement

అవసరమైన యంత్రాలను సకాలంలో సమకూర్చి, తవ్వకాల ప్రతి దశలో సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు. టన్నెల్‌–1లో రెండు వైపుల నుంచి సాగుతున్న తవ్వకాలు 2028 మే–జూన్‌ నాటికి కలిసే దశకు చేరుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. తవ్వకాలతోపాటే సొరంగం లోపలి గోడలను బలపరిచే స్ప్రే లైనింగ్‌ పనులు చేపడుతున్నారని,ప్రధాన సొరంగంతోపాటు టన్నెల్‌–2, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, ఇతర అనుబంధ పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎంపీలు కె. రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేల్‌, కె. జైవీర్‌రెడ్డి, వేముల వీరేశం, అనిల్‌ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌ నాయక్‌; నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ. శ్రీధర్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఓ.వి. రమేష్‌బాబు, కలెక్టర్లు పాల్గొన్నారు.

Also read: ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

Tags

Related News

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!

హైదరాబాద్‌లో 70 ఏళ్ల పాలనా వ్యవస్థ రద్దు.. కొత్త చట్టం అమలు!

Big Stories

Advertisement
×