E-Paper
Advertisement

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!

బిగ్ బాస్ 10 నరేష్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? వంద నుంచి లక్షల వరకూ!
Advertisement

Bigg Boss 10 Naresh: బుల్లితెర కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో జబర్దస్త్ నరేష్ (Jabardasth Naresh)ఒకరు. పొట్టి నరేష్ గా జబర్దస్త్ కార్యక్రమంలో తన కామెడీతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నరేష్ ప్రస్తుతం బిగ్ బాస్10 తెలుగు (Bigg Boss 10 Telugu) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ అద్భుతంగా టాస్కులు ఆడుతూ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాడు. ఇక నరేష్ బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడానికి ముందుగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో ఆశక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

మొదటి సంపాదన రూ.500..

ఇక నరేష్ తన మొదటి సంపాదన(First Earning) గురించి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు ఎదురవడంతో తన మొదటి రెమ్యూనరేషన్ గురించి నరేష్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను మొదటి సంపాదన ద్వారా అక్షరాల 500 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నానని నరేష్ తెలిపారు. తనకు ఈ రెమ్యూనరేషన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) అన్న ఇచ్చారని నరేష్ గుర్తు చేసుకున్నారు. ఒక స్కిట్లో భాగంగా తాను ఒక చిన్న రోల్ చేశాను అందుకుగాను నాకు రాకేష్ అన్న 500 రూపాయల పారితోషకం ఇచ్చారని, ఇదే తన మొదటి సంపాదన అంటూ నరేష్ తెలియజేశారు.

వారానికి లక్షల్లో రెమ్యూనరేషన్..

Advertisement

ఈ విధంగా నరేష్ తన మొదటి సంపాదనగా 500 రూపాయలు అది కూడా జబర్దస్త్ రాకింగ్ రాకేష్ నుంచి తీసుకున్నారనే విషయాన్ని తెలియజేశారు అనంతరం జబర్దస్త్ కార్యక్రమంలో పలు స్కిట్లు చేస్తూ భారీగా సంపాదించారు. వంద రూపాయలతో మొదలైన ఈయన రెమ్యూనరేషన్ నేడు లక్షల్లో ఉందని చెప్పాలి. ఇలా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలలో కమిటీ అనగా పాల్గొంటున్న మరోవైపు ఎన్నో ప్రైవేట్ ఈవెంట్ల ద్వారా కూడా సందడి చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక  ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా నరేష్ హౌస్ లో కొనసాగుతూ వారానికి రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో బుల్లెట్ భాస్కర్ టీంలో పెద్ద ఎత్తున కామెడీతో సందడి చేసిన నరేష్ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కూడా భారీగా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు.

టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నరేష్…

బిగ్ బాస్ హౌస్లో ఏ విధమైనటువంటి గొడవలకు వెళ్లకుండా.. తనదైన శైలిలోనే టాస్కులు ఆడుతూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పటికే పలువురు బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ కచ్చితంగా నరేష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటారని కూడా తెలియజేశారు. మరి అందరూ భావించినట్టుగానే నరేష్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉంటారా? లేదంటే మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: విజయ్ లో ఆ క్వాలిటీ అస్సలు నచ్చదు… రష్మిక కామెంట్స్ వైరల్!

Related News

దివి పెళ్లి ఆగిపోయిందా? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం!

బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి కాపురంలో ప్రభా చిచ్చు.. తాయత్తు ప్లాన్.. బాలు దెబ్బకు షాక్…

Ninnu kori Serial Today Episode October 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి గురించి నిజం సామ్రాట్ కు తెలుస్తుందా..? 

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కు ఫోన్ చేసి రాథోడ్ నిజం చెప్తాడా..? – పార్థును కాపాడతారా..?    

బిగ్ బాస్ 10 లో ఎల్లో కార్డు అందుకున్న ఫస్ట్ కంటెస్టెంట్

Big Stories

Advertisement
×