E-Paper
Advertisement

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?
Advertisement

Zombie Reddy 2 Upendra: ప్రముఖ కన్నడ స్టార్ హీరోగా, రియల్ స్టార్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఉపేంద్ర(Upendra ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడలో పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన తెలుగులో కూడా స్టార్ హీరోల చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈమధ్య కాలంలో సినిమా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో ప్రతి భాషా ప్రేక్షకుడికి చేరువవుతూ.. తన అద్భుతమైన నటనతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు ఉపేంద్ర. ఇకపోతే నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న జాంబీ రెడ్డి మూవీ సీక్వెల్ జాంబీ రెడ్డి 2 నుంచి స్పెషల్ విషెస్ చెబుతూ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్..

జాంబీ రెడ్డి 2 నుంచి ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..

సూపర్ హీరో తేజ సజ్జా (Teja sajja) తో కలిసి ఉపేంద్ర స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న చిత్రం జాంబీ రెడ్డి 2. ఈ చిత్రం నుండి ఆయన నటిస్తున్న పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన పోస్టర్లో.. చెట్టు మీద నుంచి తలకిందులుగా వేలాడుతూ చేతిలో రైఫిల్ పట్టుకున్న ఉపేంద్ర లుక్ ను వారు విడుదల చేశారు. ఈ పోస్టర్ కి “ప్రపంచాన్ని తలకిందులు చేసేందుకు రియల్ స్టార్ సిద్ధమవుతున్నారు” అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఇచ్చి.. సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసారు. ఇప్పటివరకు వెండితెరపై ఎన్నడూ చూడని సరికొత్త వైవిధ్యమైన అవతార్లో ఉపేంద్ర కనిపించబోతున్నారు” అంటూ మేకర్స్ తెలిపారు.. ఇక ఆయన ఆ పాత్రలో కనిపించే మ్యాడ్ నెస్, మాస్ కలగలిసిన సరికొత్త ఫ్లేవర్ ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంటుందని కూడా యూనిట్ తెలిపారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఉపేంద్ర లుక్ మాత్రం సినిమాపై ఊహించని బజ్ క్రియేట్ చేసిందని చెప్పాలి.

అంచనాలు పెంచుతున్న పోస్టర్..

Advertisement

తేజ సజ్జా తో పాటు ఉపేంద్ర కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడం సినిమాకు ప్రధాన హైలెట్గా నిలిచింది. వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాలో మాస్ రచ్చ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్ర నెలకొంది. మొత్తానికి జాంబీ రెడ్డి 2 పేరుతో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు , అభిమానులు ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

సీక్వెల్ అంతకుమించి..

జాంబీ రెడ్డి.. తేజ సజ్జా, ఆనంది కాంబినేషన్లో ఆపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్ నిర్మాణంలో.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది . జాంబీ నేపథ్యంలో వచ్చిన మొదటి చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. థియేటర్లలో విడుదలై ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది . క్రైమ్, థ్రిల్లర్, కామెడీ మూవీగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకోవడంతో దాదాపు 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమా ప్రకటించారు.. మరి ఈ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

Related News

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?

భాగ్యశ్రీతో రామ్ బ్రేకప్?

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఎంగేజ్‌మెంట్.. ఇప్పుడు ఎవరి దారి వారిదే!

అందాల విందుతో ఐశ్వర్య మీనన్..కెమెరాలన్నీ ఆమెవైపే!

నాని చెప్పిన ‘సమ్మక్క’ వెనుక అసలు కథ ఏంటి?

సూర్య–జ్యోతిక మతం మార్చుకున్నారా? అసలు నిజం ఇదే!

Big Stories

Advertisement
×