E-Paper
Advertisement

చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!

చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!
Advertisement

Xiaomi Smart Camera 5 Pro: ప్రముఖ షియోమీ చైనాలో కొత్త ‘స్మార్ట్ కెమెరా 5 ప్రో’ను తీసుకొచ్చింది. ఇందులో ప్రత్యేకంగా ఫుల్ కలర్ నైట్ విజన్ ఫీచర్‌ను అందించారు. సాధారణ సెక్యూరిటీ కెమెరాల్లో రాత్రి సమయంలో బ్లాక్ అండ్ వైట్ వీడియో కనిపిస్తుంది. కానీ ఈ కొత్త కెమెరాలో చీకట్లోనూ రంగులతో కూడిన వీడియోను చూపించేలా రెండు సెన్సర్లు, అదనపు లైటింగ్‌ను ఉపయోగించారు. క్రౌడ్‌ఫండింగ్ సమయంలో దీని ధర రూ.5,100గా ఉంది. సాధారణ ధర రూ.7,200గా ఉంటుంది. భారత్‌లో విడుదల తేదీ, ధరపై షియోమీ ఇంకా వివరాలు వెల్లడించలేదు.

రెండు సెన్సర్లతో 4K వీడియో..

షియోమీ Smart Camera 5 Proలో 8MP ప్రధాన సెన్సర్‌తో పాటు 4MP మరో సెన్సర్‌ను ఇచ్చారు. ఈ డ్యూయల్ సెన్సర్ సెటప్‌తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. తక్కువ వెలుతురులోనూ కలర్ వీడియో కోసం సాఫ్ట్ లైట్‌ను అందించారు. పూర్తిగా చీకటిగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి ఈ లైట్ పనిచేసి పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. హ్యూమన్ డిటెక్షన్, ఈవెంట్ ఆధారిత రికార్డింగ్ వంటి నైట్ విజన్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Advertisement

Also Read: 8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!

లోకల్ AIతో అలర్ట్స్..

కెమెరాలో 1.5 TOPS సామర్థ్యంతో AI చిప్ ఉంది. ఇది క్లౌడ్‌కు డేటాను పంపకుండా కెమెరాలోనే మనుషులు, పెంపుడు జంతువులను గుర్తించగలదు. పిల్లల ఏడుపును గుర్తించి అలర్ట్ ఇచ్చే సదుపాయం కూడా ఉంది. డ్యూయల్ మోటార్ వ్యవస్థతో కెమెరాను 360 డిగ్రీలు తిప్పవచ్చు. పైకి, కిందికి కలిపి 174 డిగ్రీల వరకు కదిలించవచ్చు.

Wi-Fi 6, స్టోరేజ్, ప్రైవసీ..

Advertisement

కెమెరాలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 6, రెండు వైపులా మాట్లాడుకునే సదుపాయం, మిజియా స్మార్ట్ కనెక్ట్ ఉన్నాయి. Wi-Fi 6 వల్ల డేటా ట్రాన్స్‌మిషన్ వేగం 60 శాతం వరకు పెరుగుతుందని షియోమీ చెబుతోంది. వీడియోలను మైక్రోSD కార్డ్, క్లౌడ్ లేదా NASలో భద్రపరచవచ్చు.

ఇంటి నిఘాకు ఉపయోగకరం..

ప్రైవసీ కోసం లెన్స్ మాస్కింగ్, లోకల్ AI ప్రాసెసింగ్, యాక్సెస్ కంట్రోల్స్ ఇచ్చారు. లివింగ్ రూమ్, పిల్లల గది, వృద్ధుల సంరక్షణ, పెంపుడు జంతువులపై నిఘా వంటి అవసరాలకు ఈ కెమెరాను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా రాత్రి సమయంలోనూ కలర్ వీడియో, 360 డిగ్రీల పర్యవేక్షణ వంటి ఫీచర్లు దీనిలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Also Read: ట్రిపుల్ లేజర్‌తో మార్కెట్లోకి వచ్చేసిన 4K ప్రొజెక్టర్.. 6100 ISO ల్యూమెన్స్‌తో అదరగొడుతోంది!

Tags

Related News

అప్పుల ఉచ్చులో..చిక్కుకున్నారా? ఈ 7 తెలివైన మార్గాలతో ఈజీగా బయటపడండి

సముద్రంపైనే అద్భుత వ్యవసాయం.. ఉప్పు నీటితో కూరగాయల సాగు.. అదరగొట్టేశారు కదయ్యా!

ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!

8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!

ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్

ట్రిపుల్ లేజర్‌తో మార్కెట్లోకి వచ్చేసిన 4K ప్రొజెక్టర్.. 6100 ISO ల్యూమెన్స్‌తో అదరగొడుతోంది!

Big Stories

Advertisement
×