Relangi Biography: రేలంగి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాస్యానికి నిలువెత్తు రూపం. తనదైన అమాయకత్వంతో అంతకుమించిన హాస్యంతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న రేలంగి పూర్తి పేరు రేలంగి వెంకట్రామయ్య .వెండితెరపై హాస్యనటుడిగా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన రేలంగి భారతదేశంలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి కమెడియన్ కావడం విశేషం.మరి ఎన్నో అష్ట కష్టాలు పడి హాస్య నట చక్రవర్తి బిడ్డను సంపాదించుకున్న రేలంగి జీవితంలోని ఆసక్తికర విశేషాలు ఏంటో ఒకసారి చూసేద్దాం .కాకినాడ దగ్గరలోని రావులపాడు అనే గ్రామంలో 1910 ఆగస్టు 9న జన్మించారు రేలంగి రామస్వామి,అచ్చాయమ్మ లకి రేలంగి ఒక్కడే కొడుకు .అయితే రేలంగికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే తల్లిని కోల్పోవడం బాధాకరం.అయినా కొడుకుని పెంచి పెద్ద చేయాలి ఉన్నత స్థానాల్లో చూడాలి అన్న ఉద్దేశంతో రామస్వామి మొదటి పెళ్లి చేసుకోకుండా ఉండాలని అనుకున్నారు కానీ రేలంగి తల్లి లేని పిల్లాడిగా ఉండకూడదని బంధువుల ఒత్తిడితో అచ్చాయమ్మ చెల్లెలు గౌరమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు రామస్వామి.
రామస్వామి పూర్వీకులు కల్లు అమ్మేవారు కానీ రామస్వామి చదువుకోవడం వల్ల కళ్ళు అమ్మకుండా సంగీత మాస్టారుగా హరికథలు చెప్పే వారిగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు .ఇక తండ్రి బాటలోనే రేలంగి నడవడం వల్ల చిన్నతనంలోని హరికథలు చెప్పడం సంగీతం వాయించడం త్వరగానే అలవాటు చేసుకున్నారు .అయితే రేలంగి మంచి ఫిజిక్ ఉండడంతో ఎలాగైనా కొడుకుని పోలీస్ ఆఫీసర్ గా చూడాలని ఆశపడ్డాడు రామస్వామి.ఒక దశలో రేలంగికి కూడా పోలీస్ అవ్వాలని కోరిక కలిగింది కానీ నాటకాలపై ఉన్న పిచ్చి వల్ల ఆయనకు చదువుపై ఏమాత్రం శ్రద్ధ ఉండేది కాదు .ఫలితంగా 9వ తరగతిలో ఫెయిల్ కావడంతో తండ్రి చేతిలో దెబ్బలు తిన్నారు కూడా.కానీ ఆ దెబ్బలు రేలంగిలోని నటుడిని ఆపలేకపోయాయి .
అలా ఒకరోజు తండ్రితో కలిసి కాకినాడలోని హ్యాపీ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ వారు వేసిన ఒక నాటకానికి వెళ్లారు.అక్కడ స్టేజిపై నటుల నటనని దానికి ప్రేక్షకులు కొట్టిన చప్పట్లను చూసిన రేలంగి ఎలాగైనా నటుడిగా స్థిరపడాలని ఫిక్స్ అయిపోయారు .ఆ తర్వాత తండ్రికి తెలియకుండా అదే హ్యాపీ క్లబ్ లో చేరి చిన్న చిన్న వేషాలు వేయడం మొదలుపెట్టారు .అయితే ఈ విషయం తండ్రికి తెలిసి తీవ్రంగా కోపడ్డప్పటికీ రేలంగి తన ఇష్టాన్ని చంపుకోకుండా అలాగే కొనసాగించాడు.చివరకు రేలంగిలోని కసిని తపనని అర్థం చేసుకున్న రామస్వామి నటుడిగా మంచి పేరు తెచ్చుకోమని ఆశీర్వదించారు.ఇక తండ్రి ఆశీస్సులు ఇవ్వడంతో పదేళ్లపాటు అనేక పాత్రలు వేస్తూ బాగా రాటుదేలారు .
సరిగ్గా అదే సమయంలో అంటే 1932లో తొలి తెలుగు టాకీ సినిమా తొలి టాకీ సినిమా భక్త ప్రహ్లాద రిలీజ్ అయింది.అప్పట్లో తెలుగు సినిమాలు అన్నింటిని బొంబాయి కలకత్తా వంటి నగరాల్లోని తెరకెక్కించేవారు.అయితే అదే సమయంలో ప్రముఖ దర్శకుడు పి పుల్లయ్య నిర్మించబోయే సినిమా కోసం తన మిత్రుడు పరదేశి కలకత్తా వెళ్తున్నాడని తెలుసుకున్న రేలంగి తాను కూడా వస్తానని పట్టుపట్టాడు.మొదట తాను వెళ్లి అక్కడ పరిస్థితులను చూసి వచ్చి తీసుకెళ్తానని పరదేశి మాట ఇచ్చాడు .
అదే సమయంలో రామస్వామి తన కొడుక్కి బాధ్యతలు తెలవాలన్న ఉద్దేశంతో 1933 డిసెంబర్ 8న బుచ్చియమ్మతో పెళ్లి జరిపించారు .పెళ్లి అయిన కొన్నాళ్లకే మరొక నాటక సమాజం కలకత్తా వెళ్తున్నారని తెలిసి భార్య తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని కలకత్తాకు ప్రయాణమయ్యాడు రేలంగి.అక్కడ దర్శకుడు అయిన పి పుల్లయ్యని పరిచయం చేసుకొని కేవలం నటనకే పరిమితం కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా, ప్రొడక్షన్ అసిస్టెంట్ గా, క్యాస్టింగ్ అసిస్టెంట్ గా ఇలా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల్లో దాదాపు 15 సంవత్సరాలు పనిచేశారు రేలంగి.ఇక సినిమా ఇండస్ట్రీ మద్రాస్ కి మారడంతో పుల్లయ్య కూడా మద్రాస్ వచ్చేసాడు .
ఆయనతో పాటు రేలంగి కూడా తన భార్య, తల్లిదండ్రులను తీసుకొని మద్రాస్ లో అడుగు పెట్టాడు.కాస్టింగ్ ఏజెంట్ గా ఉండటంతో ఆయన చేతుల మీదుగానే పుష్పవల్లి, కృష్ణవేణి, భానుమతి, అంజలి దేవి వంటి గొప్ప గొప్ప నటీమణులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు .ఇక ఆ తర్వాత వాళ్ళు హీరోయిన్లుగా మారి సినిమాల నిర్మించినప్పుడు మొదటి అవకాశం ఇచ్చిన రేలంగిపై కృతజ్ఞత చూపిస్తూ మంచి మంచి పాత్రలు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే రేలంగి దగ్గర పుల్లయ్య దగ్గర పని చేసిన 15 సంవత్సరాల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డాడు రేలంగి చిన్న చిన్న వేషాలు వేసిన గుర్తింపు మాత్రం రాలేదు. ఒకవైపు చేతిలో డబ్బులు లేవు, మరోవైపు భార్యా తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. వారికి వైద్యం చేయించేందుకు డబ్బు లేకపోవడంతో తన గురువు పుల్లయ్యతో పాటు మరికొంతమంది స్నేహితుల ఆర్థిక సహాయంతో వారికి చికిత్స చేయించారు.
అయితే ఇక ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రావాలని కాకినాడ చేరుకున్న రేలంగికి వింధ్యరాణి అనే సినిమా మళ్లీ ఇండస్ట్రీకి వైపుకి తిరిగి చూసేలా చేసింది.1948లో పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఇక ఆ తర్వాత అంటే 1949లో వచ్చిన కీలుగుఱ్ఱం ఆయనకి ఎంతటి పేరు తెచ్చిందో చెప్పనక్కర్లేదు ఇక ఆ తర్వాత కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన గుణసుందరి కథ సినిమాలో రేలంగి పోషించిన కళామతి క్యారెక్టర్ రేలంగిని వెనక్కి తిరిగి చూసుకోకుండా చేసింది.అలా 1950 నుంచి 70 వరకు ఏకంగా 20 ఏళ్ల పాటు తెలుగులో రేలంగి లేని సినిమా లేదంటే ఎంత బిజీగా ఉండేవాడు అర్థం చేసుకోవచ్చు .
ముఖ్యంగా రేలంగి, రమణారెడ్డిలో కాంబినేషన్ అంటే ప్రేక్షకులు థియేటర్లకి ఎగబడి పోయేవారు ఇక ఇక రేలంగితో అత్యధిక సినిమాలు చేసింది సూర్యకాంతం, గిరిజ.ఇక రేలంగికి గుర్తింపు తెచ్చిన సినిమాల విషయానికొస్తే మిస్సమ్మ, మాయాబజార్, పాతాళభైరవి, అప్పుచేసి పప్పుకూడు ,వెలుగునీడలు, నర్తనశాల విప్రనారాయణ వంటి ఎన్నో క్లాసిక్ సినిమాలో రేలంగి చేసిన పాత్రలు హీరోలకి సమానంగా నిలిచాయి అంటే ఆశ్చర్యం లేదు .అయితే రేలంగి నటుడు గానే కాకుండా సింగర్ గాను గుర్తింపు తెచ్చుకున్నారు .ఆయన పాడిన వినవే బాల నా ప్రేమ గోల, ధర్మం చెయ్ బాబు, సరదా సరదా సిగరెట్టు వంటి పాటలు ఇప్పటికీ కడప వినిపిస్తూనే ఉంటాయి.ఇక నిర్మాతగాను ఆయన సమాజం అనే పేరుతో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను నిర్మించారు .అయితే ఇదే సినిమా ప్రముఖ హాస్య నటుడు రాజబాబుకి మొదటి సినిమా కావడం విశేషం .
అయితే కెరీర్ లో 300 పైగా సినిమాలు చేసిన రేలంగి ఇండస్ట్రీకి వస్తున్న కొత్త హాస్య నటులకి అవకాశాలు రావాలని ఉద్దేశంతో సినిమాలను సంఖ్యలను తగ్గించుకుంటున్నట్టు పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం.రేలంగి తీసుకున్న ఆ నిర్ణయం వల్లే పద్మనాభం, రాజబాబు, చలం వంటి ఎందరో కమెడియన్లు వచ్చి స్టార్ట్ అయ్యారు.ఇక సాధించిన విజయాలకు సత్కారాలకు అయితే లెక్కే లేదు.వీటన్నింటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భారతదేశ ప్రభుత్వం తొలిసారి ఒక హాస్యనటుడైన రేలంగికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం.పుట్టింది కాకినాడలో అయినా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అక్కడి ప్రజలన్నీ సొంతమనుషుల చూసుకునేవారు అందుకే చివరి రోజుల్లో తాడేపల్లిగూడెంలోనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు రేలంగి.
ఇక అక్కడే సకల సౌకర్యాలతో రేలంగి చిత్ర మందిర్ అనే ఒక సినిమా థియేటర్ను కూడా నిర్మించారు .ఆ రోజుల్లో తాడేపల్లిగూడెం లాంటి చిన్న టౌన్ ప్రజలకు ఎంటర్ ది డ్రాగన్ మెకానాస్ గోల్డ్ వంటి క్లాసిక్ సినిమాలు చూసే అవకాశాన్ని ఈ థియేటర్ ద్వారా కల్పించారు రేలంగి రేలంగికి దానగుణం ఎక్కువ కష్టపడి సంపాదించిన డబ్బుని పేదలకు ఇచ్చేందుకు ఎప్పుడు వెనకడుగు వేయలేదు.ఇక తాడేపల్లిగూడెంలోని రేలంగి ఇంట్లో రోజు అన్నదాన కార్యక్రమం జరిగేది .
రేలంగికి ఒక కొడుకు పేరు సూర్యనారాయణ బాబు . అతడికి ఎంతోమంది కోటీశ్వరులు పిల్లనిస్తామని వచ్చినప్పటికీ తను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నమ్మి పిల్లనిచ్చిన బావమరిది కూతుర్నే తన కోడలిగా తెచ్చుకొని వారి పట్ల గౌరవాన్ని చాటుకున్నారుసత్యనారాయణ బాబు కూడా చిన్నతనం నుంచి నాటకాలపై ఇష్టం పెంచుకొని బాలానందం అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నడిపి నటించినప్పటికీ తందకి ఇచ్చిన మాట కోసం సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అయితే జీవిత చివరి రోజుల్లో రేలంగి కీళ్ళకి సంబంధించిన నొప్పి సీరియస్ గా మారి నడుం భాగం వరకు పాకడంతో అది ఎందుకు ఎముకలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధిగా డాక్టర్లు గుర్తించారు. ఇక 1975 నాటికి ఆయన ఆరోగ్యం విషమించింది. అదే ఏడాది నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన నివాసంలోనే కన్నుమూశారు రేలంగి.