E-Paper
Advertisement

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !
Advertisement

Telangana Ticket Price Hike:టాలీవుడ్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు టికెట్ రేట్లు పెంచండి మహా ప్రబో అంటూ మేకర్స్ సర్కార్ చుట్టూ చక్కర్లు కొడతారన్న సంగతి తెల్సిందే.అయితే తాజాగా ఈసారి తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఒక షాకింగ్ డిసీషన్ తీసుకుంది.

అదనపు రాబడిలో 20 శాతం మొత్తాన్ని

ఇక ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆర్డర్ ప్రకారం.. టికెట్ ధరలు పెంచడం ద్వారా థియేటర్లకి వచ్చే అదనపు రాబడిలో 20 శాతం మొత్తాన్ని టీజీఎఫ్‌డీసీ (తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కి సంక్షేమ విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ 20 శాతం వాటాను థియేటర్ యజమానులైన ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేసే పూర్తి బాధ్యతను నిర్మాతలకు అప్పగించింది సర్కార్. అలా వసూలు చేసిన ఆ మొత్తాన్ని ‘టీజీఎఫ్‌డీసీ’ ఖాతాకి జమ చేయాలి.ఈ ఫండ్స్ మొత్తాన్ని టీజీఎఫ్‌డీసీ  నిర్వహించే ప్రత్యేక ఖాతాలోకి జమ చేస్తారు. సినీ పరిశ్రమలో రాత్రింబవళ్లు కష్టపడే 24 శాఖల కార్మికుల సంక్షేమం కోసమే ఈ డిసీషన్ అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సినిమాలు చెల్లించాల్సిందే 

Advertisement

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ-2’, రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వచ్చిన ‘ది రాజాసాబ్’, చిరు, అనిల్ రావి పూడి కాంబోలో వచ్చిన ‘మన శంకర వర ప్రసాద్ గారు పండుగకు వస్తున్నారు’, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబినేషన్ లో వచ్చిన రా అండ్ రస్టిక్ మూవీ ‘పెద్ది’ చిత్రాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది.

ఇక ఈ 20 శాతం వెల్ఫేర్ ఫండ్ వసూలు చేసి అకౌంట్లో జమ చేసే బాధ్యతను కూడా ఆ సినిమాల ప్రొడ్యూసర్లకే ఇచ్చింది హోంశాఖ. ఇందుకోసం ప్రముఖ నిర్మాణ సంస్థలైన 14 రీల్స్ ప్లస్ ఎల్‌ఎల్‌పీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ, వృద్ధి సినిమాస్ ఎల్‌ఎల్‌పీలకు ప్రభుత్వం లేఖలు పంపింది కూడా.

ముందు ముందు ఏం జరుగుతుందో !

Advertisement

ఇక ఇప్పటివరకు టికెట్ రేట్లు పెంచితే కేవలం ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లే లాభపడతారనే టాక్ గట్టిగా ఉండేది. కానీ ఇప్పుడు అదనపు రాబడిలో 20 శాతం డైరెక్ట్‌గా సినిమా కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కి వెళ్లడం నిజంగానే మంచి పరిణామమని భావిస్తున్నారు ట్రేడ్ పండితులు.అయితే ఈ వసూళ్ల ప్రక్రియ ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్ల మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో అని క్యూరియస్ గా వాచ్ చేస్తుంది ఇండస్ట్రీ.మొతంగా ప్రస్తుతం తెలంగాణా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే పెద్ద సినిమాల టికెట్ రెట్లు,భాక్సాఫీస్ లెక్కలపై కూడా గట్టిగానే ప్రభావం చూపేలా ఉంది.చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×