E-Paper
Advertisement

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!
Advertisement

Shakti Scheme: ప్రభుత్వం విద్యార్థుల భవిష్యతిపై ప్రయోగాలు చేయడం మానుకోవాలని, శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు డీవైఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం మేడ్చల్లో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాల కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుతుందన్నారు. గతంలోఉన్న ఎసీ టెట్ వ్యవస్థను రద్దే చేసి కొత్తగా జీవో నెంబరు 97 తీసుకువచ్చిందన్నారు. శక్తి స్కీమ్తో విద్యార్థులు తీవ్రంగా నష్టం జరుగుతుందన్నారు.

లాటరల్ ఎంట్రీకి ఇబ్బందులు..

గతంలో వోకేషనల్, ఐటీఐ విద్యా విదానాలను కూడా ఉన్నత విద్యకు పరిమిత అవకాశాలు కలిగే విధంగా రూపొందించారన్నారు. దీంతో విద్యార్థులు పై చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. పాలిటెక్నిక్ విద్యను కూడా అదే తరహాలో విధానాలను అమలుకు పూనుకున్నారన్నారు. ఈ విధానం వల్ల పాలిటెక్నికల్ విద్యార్థుల లాటరల్ ఎంట్రీకి ఇబ్బందులు ఎదురవుతాయని, ద్వారా ఉన్నత విద్య అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. ప్రభుత్వం ఏదైనా విధానంతీసుకువస్తే ఉన్నత విద్య, ఉపాధికి అవకాశాలు ఉండాలి కానీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు.

Advertisement

Also Read: అసెంబ్లీలో చంద్రబాబు సంచలనం.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై క్లారిటీ ఇచ్చిన సీఎం!

జీవో 37 రద్దు..

వెంటనే ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 37 ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళన సీటీఐయూ మండల కార్యదర్శి నరేశ్ మద్దతు తెలిపారు. అంతకు ముందుకు భారీ నిరసన ప్రదర్శన జరిపారు. విద్యార్థులు ఆందోళనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇరువైపులా కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో హర్షిణి, దుర్గా, శ్రీజ, భరత్, రాకేశ్, ధీరజ్, రామ్, సుశాంత్, శ్రావణ్, మహోన్నత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: 22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

Tags

Related News

హుస్నాబాద్‌లో విషాదం.. ఆగి ఉన్న మున్సిపల్ ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు దుర్మరణం!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. శుక్రవారం లోపు డబ్బులు చెల్లించాలి, లేకుంటే రద్దయ్యే ఛాన్స్!

రూ. 400 కోట్లతో తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్.. భూమిపూజ చేసిన కిషన్ రెడ్డి

ట్యాంక్‌బండ్ వద్ద లారీ బీభత్సం.. ఆరేళ్ల పాపతో పాటు బంధువు మృతి!

దమ్ముంటే రాజీనామా చేయండి.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డీకే అరుణ ఓపెన్ ఛాలెంజ్!

జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం

మద్యం ప్రియులకు షాక్.. నేటి నుంచి తెలంగాణలో బార్లు-రెస్టారెంట్లు బంద్, మళ్లీ ఏమైంది?

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

Big Stories

Advertisement
×