E-Paper
Advertisement

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్! ప్రభుత్వంపై ముప్పేట దాడి.. ధీటుగా జ‌వాబివ్వ‌లేక‌పోతున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్! ప్రభుత్వంపై ముప్పేట దాడి.. ధీటుగా జ‌వాబివ్వ‌లేక‌పోతున్న కాంగ్రెస్ సోష‌ల్ మీడియా!
Advertisement

బీఆరెస్ సోష‌ల్ మీడియాను స‌ర్కార్ త‌ట్టుకోలేక‌పోతున్న‌దా? విప‌రీతంగా అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తూ రేవంత్‌ను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌దా? అంటే అవున‌నే అనిపిస్తుంది సీఎం రేవంత్ వార్నింగుల‌ను చూస్తే. ఇటీవ‌ల ఏ స‌భ జ‌రిగినా చివ‌ర‌గా బీఆరెస్ సోష‌ల్ మీడియాకు ఓ వార్నింగ్ ఇస్తున్నారాయ‌న‌.

తోలు తీస్తానంటున్నాడు. మిమ్మ‌ల్ని వ‌దిలేది లేదని వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వార్నింగుల‌కు వారు భ‌య‌ప‌డేది ఏమీ ఉండ‌దు. ఇంకా మ‌రింత రెచ్చిపోవ‌డం త‌ప్ప‌. ఎందుకంటే గ‌త మూడేండ్లుగా చూస్తున్నాం.. వారు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వారి వెనుక అలాంటి భ‌ధ్ర‌త ఉంది మ‌రి. కేటీఆర్ వీరికి నెల‌కు కోట్లాది రూపాయ‌లు వెచ్చించ‌డ‌మే కాదు.. లీగ‌ల్‌గా కూడా వారికి ర‌క్ష‌ణనిస్తున్నాడు. అంత‌కు మించి ఇక‌పై వ‌చ్చేది మ‌న‌మేన‌నే ఓ భ‌రోసా ఇవ్వ‌డం కూడా బీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌లో రెట్టించిన ఉత్సాహాన్నిస్తున్న‌ది.

Advertisement

సేమ్‌, బీజేపీకి ఉన్న‌ట్టుగా, బీఆరెస్‌కు కూడా అభిమానులున్నారు. కేటీఆర్ ముఖం చూసి కాదు.. కేసీఆర్‌ను బాగా ఇష్ట‌ప‌డేవార‌న్న‌మాట‌. వీరంతా మ‌ళ్లీ కేసీఆర్ రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. దీంతో వారు స్వచ్ఛందంగానే త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. కౌంట‌ర్లిస్తున్నారు.

దీనికి ధీటుగా స్పందించ‌లేక చ‌తికిల‌బ‌డుతోంది కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా. ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నా.. అవి కూడా ప‌రిమిత వ‌న‌రులే. అంత యాక్టివ్‌గా వారేం లేరు. బీఆరెస్ వారియ‌ర్స్‌తో పోల్చితే వీరు ఓ లెక్కలోకి కూడా రారు. అందుకే సీఎంకు ఇది మ‌రీ చిరాకు తెప్పిస్తున్న‌ట్టుంది. అందుకే ఆయ‌న ఏకంగా బ‌హిరంగ స‌భ‌ల వేదిక‌ల మీదే బీఆరెస్‌పై ఫైర్ అవుతున్నారు.

Advertisement

కేటీఆర్‌కు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు కూడా అప్పీలు చేసుకుంటున్నారు. ఆ త‌ప్పుడు వార్త‌ల‌ను, అబ‌ద్ద‌పు ప్ర‌చారాల‌ను న‌మ్మొద్ద‌ని రిక్వెస్టు చేస్తున్నాడు. మ‌రోవైపు దీనిపై సీఎం ఆదేశాల‌తో సైబ‌ర్ క్రైమ్ సీరియ‌స్‌గా దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో బీఆరెస్‌కు చెందిన టీమ్‌లో కొంద‌రిని అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరికి బీఆరెస్ లీగ‌ల్ టీమ్ అండ‌గా ఉండ‌ట‌మే కాదు..ఆర్థికంగా, అన్ని విధాలుగా భ‌రోసాగా నిలుస్తూ వ‌స్తోంది.

దీంతో ఆ వారియ‌ర్స్ వెనక‌డుగు వేయ‌డం లేదు. దీంతో మ‌ళ్లీ వీరిపై పంజా వేయాల‌ని స‌ర్కార్ భావిస్తోంది. సీఎం ఇంత‌లా సీరియ‌స్ అయ్యారంటేనే.. ఇక బీఆరెస్ సోష‌ల్ మీడియాపై వేట మొద‌లైంద‌నే అభిప్రాయ‌లు వెల్ల‌డ‌వుతున్నాయి. వీరిపై చ‌ర్య‌లు తీసుకోకుంటే.. మున్ముందు మ‌రింత న‌ష్టం క‌లిగించ‌డం ఖాయ‌మ‌నే భావ‌న‌లో ఉంది రేవంత్ స‌ర్కార్‌.

Tags

Related News

క్యూర్ పరిధి ప్రజలకు అలర్ట్.. మీ ఆస్తి పన్ను బిల్లులో కొత్తగా చేరనున్న ఛార్జీలు ఇవే!

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మార్పుపై ఏఐసీసీ కసరత్తు.. లిస్టులో ఆ కీలక నేత?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్..?

కాంగ్రెస్‌లో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల రచ్చ.. ఈ 3 స్థానాల కోసం భారీగా అప్లికేషన్లు!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ షాక్.. ఫ్రీ ఇసుక నో..?

‘పల్లె పల్లెకు పొన్నం’ గ్రాండ్ సక్సెస్.. త్వరలో మరో పర్యటనకు పొన్నం షెడ్యూల్!

విశ్వాసం కోల్పోయిన ఎన్నికల సంఘం.. జనాల్లోకి బలంగా వెళ్లిన ఎస్‌ఐఆర్‌ అక్రమాలు..! మోడీ సర్కార్‌కు గుదిబండగా మారిన సీఈసీ జ్ఞానేశ్వర్‌..!

ఇదే నినాదంతో ఎన్నికలకు పోయే దమ్ముందా? కేటీఆర్‌ను లేపాలని చూస్తే.. పార్టీకి మరింత నష్టమే..! వివాదస్పదమవుతున్న రసమయి కామెంట్స్‌..!

Big Stories

Advertisement
×