E-Paper
Advertisement

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!
Advertisement

Dancers Association: గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇప్పుడు మరింత ముదిరినట్టే కనిపిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసరంగా భేటీ కావడం ఇండస్ట్రీలో ఇపుడు హాట్ టాపిక్ అయిపొయింది.

ముఖ్యంగా ఈ సమావేశానికి డాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులను పక్కన పెట్టి, మిగతా 23 క్రాఫ్ట్స్‌కు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులను మాత్రమే పిలవడం చర్చనీయాంశంగా మారింది.ఇక ఈ సమావేశంలో ఫెడరేషన్ ఎలాంటి డిసీషన్ తీసుకోబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తుంది సినీ ఇండస్ట్రీ.

2025లో సుమలత అధ్యక్షురాలిగా 

Advertisement

నిజానికి ఈ ఇష్యూ ఇప్పుడే మొదలవలేదు.2025లో సుమలత అధ్యక్షురాలిగా ఎన్నికైనప్పటి నుంచీ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.ఎన్నికలు, ఈసీ కమిటీ వ్యవహారాలు, స్థానిక డ్యాన్సర్లకు సరిగా అవకాశాలు రాకపోవడం, కొందరు సభ్యుల రాజీనామాలతో ఈ సమస్య మరింత ముదిరిపోయింది.

ఇక ఖాళీ అయిన పోస్టులకు ఉపఎన్నికలు నిర్వహించాలని సుమలత నిర్ణయించారు. అయితే ఒక వర్గం మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉన్నపళంగా ఉపఎన్నికలు పెట్టడం కాకుండా, ప్రస్తుత కమిటీని పూర్తిగా రద్దు చేసి మళ్లీ కొత్తగా పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించాలని వారు పట్టుబట్టారు.

వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేసినప్పటికీ

Advertisement

అయితే ఈ విభేదాలు మీదియాకెక్కింది మాత్రం గత జులై నెలలోనే. డాన్సర్స్ అసోసియేషన్ సమావేశంలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, ఇండస్ట్రీలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోందనే వార్తలు వచ్చాయి. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో జానీ మాస్టర్ రంగంలోకి దిగి శేఖర్ మాస్టర్‌తో తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని స్పష్టం చేసినప్పటికీ ఆ గొడవలు అలాగే కంటిన్యూ అయ్యాయి.

ప్రస్తుత కమిటీని రద్దు చేస్తారా?

ఇక ఈ గొడవలు కాస్తా అసోసియేషన్ పరిధి దాటి ఫిల్మ్ ఫెడరేషన్ ముందుకు వెళ్లాయి. జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఫెడరేషన్ నుండి ఎలాంటి సహాయసహకారాలు ఉండవు అని తేల్చి చెప్పడంతో ఈ వివాదం మరింత ముదిరింది.అయితే చిరు,బాలయ్య వంటి ఇండస్ట్రీ పెద్దల జోక్యంతో సద్దుమణిగి నట్టే కనిపించింది.

కానీ ఫెడరేషన్ చేసిన సూచనలను పెడ చెవిన పెట్టిన సుమలత ఇపుడు మరింత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో ఫిల్మ్ ఫెడరేషన్ డాన్సర్స్ అసోసియేషన్‌కు ఇచ్చే సహకారాన్ని నిలిపివేసింది.

also read :బిగ్ బాస్ తర్వాత గంగవ్వ లైఫ్ మొత్తం మారిపోయిందా? అంజి మామ షాకింగ్ కామెంట్స్

దీంతో ఇప్పుడు జరుగుతున్న జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ వివాదంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. డాన్సర్స్ అసోసియేషన్‌లోని ప్రస్తుత కమిటీని రద్దు చేస్తారా? లేదా సుమలతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది సమావేశం ముగిస్తే కాని తెలిసేలా లేదు !

Tags

Related News

బావ బామ్మర్ది కథతో వెంకీ–కళ్యాణ్ రామ్.. టైటిల్ అదిరిపోయిందిగా!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?

Big Stories

Advertisement
×