E-Paper
Advertisement

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!
Advertisement

Venkatesh Kalyan Ram: వచ్చేసింది..అనిల్,వెంకీ,కళ్యాణ్ రామ్ సినిమా ల టైటిల్ వచ్చేసింది.అయితే అందరు అనుకుంటున్నట్టుగా జనవరి 13 అని కాకుండా ఒకరోజు ముందుకు వెళ్లి జనవరి 12న విడుదల అంటూ టైటిల్ ని పెట్టేసి అటు ఆడియన్స్ కి,ఇటు ట్రేడ్ వర్గాలకి సర్ప్రైజ్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

ఇక ఈ సినిమాని టైటిల్ కి తగ్గట్టుగానే 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించడం విశేషం.ఇక “బావా బావమరిది సౌజన్యంతో…” అనే క్రేజీ క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తుండగా, మ్యూజిక్ సెన్సేషన్ జి.వి. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు.

కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా?

Advertisement

ఇక పోస్టర్ లో విలేజ్ వాతావరణం కొట్టోచ్చినట్టు కనిపిస్తుంది.అంటే అనిల్ రావిపూడి ఈ సారి కూడా పల్లెటూరి కామెడీనే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది.పోస్టర్ లో ఎద్దుల బండి వెనుక కూర్చుని వెంకీ మామ తన మార్క్ కూల్ షేడ్స్‌తో కనిపిస్తుంటే,కళ్యాణ్ రామ్ సీరియస్ లుక్‌తో దర్శనమిచ్చాడు.ఇక వీరి పక్కనే కీర్తి సురేష్, మీనాక్షి చౌదరి ఇచ్చిన షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ తో ఎదో చూస్తున్నట్టు కనిపిస్తున్నారు.చూస్తుంటే ఈసారి ఎదో పెద్ద కన్ఫ్యూజన్ కామెడీ డ్రామాకే తెర తీసినట్టు కనిపిస్తుంది.

మరోసారి నవ్వుల సునామి ఖాయమైనట్టే

పోస్టర్ లో “బావా బావమరిది సౌజన్యంతో అనే క్యాప్షన్ బట్టి చూస్తే ఇప్పటివరకు తన సినిమాల్లో భార్యాబాధితుల కామెడీ, ఫ్రస్ట్రేషన్లు చూపించిన అనిల్ ఈసారి  బావా-బావమరుదుల మధ్య ఉండే సరదా గొడవలు, ఈగోల చుట్టూ తిరిగే హిలేరియస్ డ్రామాను తెరకెక్కించబోతున్నాడని అర్థం అవుతుంది.

Advertisement

ఇందులో గనుక వెంకటేష్ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీ ఒకే ఫ్రేమ్‌లో పడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మాములుగానే అనిల్ రావిపూడి సినిమాల్లో ఎంటర్‌టైన్మెంట్‌కి లోటు ఉండదన్న సంగతి మనకి తెల్సిందే.ఇక ఈ పోస్టర్ చూస్తుంటే వచ్చే పొంగల్ బరిలో మరోసారి నవ్వుల సునామి ఖాయమైనట్టే కనిపిస్తుంది.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !

గతంలో వెంకీ-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమాల విషయానికే వస్తే భార్యా భర్తల కామెడీతో F2: Fun and Frustration’ తీసి వంద కోట్లకి పైగా దక్కించుకున్న ఈ జోడీ ‘F3’ తో కూడా మంచి వసూల్లనే దక్కించుకుంది.

ఇక 2025 జనవరి 14న సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమా ఏకంగా 300 కోట్ల క్లబ్ లో కూర్చోవడం విశేషం.ఇక ఇపుడు ఈ కాంబోలోనే జనవరి 12 విడుదల అనే మరోసారి సినిమా వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.ఏది ఏమైనా టైటిల్స్ తోనే పండగ సీజన్ లో ఖర్చీఫ్ వేయడం ఒక్క అనిల్ రావి పూడికే సొంతం అని చెప్పాలి.

also read :సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

చూడాలి మరి నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో వస్తున్నఈ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలకి తెరతీస్తుందో !

Tags

Related News

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

ఫైట్ చేసిన భట్టు.. చంద్రకళ సేఫ్, మొత్తానికి ఇద్దరినీ కలిపేశారుగా!

మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

ఈడీ అధికారుల ఎదుట నిధి అగర్వాల్.. ఆ ప్రశ్నలు అడగనున్నారా?

Big Stories

Advertisement
×