E-Paper
Advertisement

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!

‘దమ్ముంటే ఆ అంబోతును రమ్మనండి’.. అచ్చెన్నాయుడిపై దువ్వాడ శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు!
Advertisement

Duvvada Srinivas: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా శాసన మండలిలో విపక్ష వైసీపీ – టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతోంది. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడిపై ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో వ్యవసాయాన్ని సర్వనాశనం చేశారని దువ్వాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై దమ్ముంటే వ్యవసాయ మంత్రి చర్చకు రావాలని.. ‘ఆ ఆంబోతుని రమ్మనండి’ అంటూ అచ్చెన్నాయుడ్ని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

అయితే మండలిలో ఓ వైపు క్షమించాలి అంటూనే అంబోతు అనే పదాన్ని దువ్వాడ శ్రీనివాస్ ప్రయోగించారు. ఆ పేరును సదరు మంత్రికి గతంలో తామెపెట్టామంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దానికి సార్దకత కూడా సదరు వ్యక్తి తెచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ అన్నారు. చివరికి మంత్రి సొంత నియోజకవర్గమైన టెక్కలిలో కూడా యూరియా సమస్య దారుణంగా ఉందన్నారు. ఓ మహిళ యూరియా కోసం వెళ్లి తొక్కిసలాటలో ప్రాణాలు విడిచిందని తెలియజేశారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు.

Advertisement

Also Read: ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

Advertisement

గత వైసీపీ పాలనలో ఇలాంటి పరిస్థితి లేదని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. అప్పటి సీఎం జగన్ ప్రతీ ఎకరానికి ఇన్సూరెన్స్ కట్టి.. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ముందస్తుగానే అంచనావేసి అందుబాటులో ఉంచేవారని గుర్తుచేశారు. పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర కూడా కల్పించి.. రైతులను సంతోషపెట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయం సర్వనాశనం అయిపోయిందని పునరుద్ఘటించారు. వాటన్నింటిపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడాలని అన్నారు. అటు ఆరోగ్య శ్రీని సైతం భ్రష్టుపట్టించారని దువ్వాడ పేర్కొన్నారు.

Also Read: ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

Big Stories

Advertisement
×