E-Paper
Advertisement

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!
Advertisement

Movie Ticket Prices:ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రీమియర్ షోల టికెట్ రేట్లు ఆకాశానికి తాకేవి.వేలలో పెంచినప్పటికీ డై హార్డ్ ఫ్యాన్స్ ,మూవీ లవర్స్ తప్పక జేబులు గుల్ల చేసుకునేవారు.అయితే ఇపుడు అదంతా చెల్లదు అంటూ తేల్చి చెప్పేసింది.అవును..సింగిల్ స్క్రీన్ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు ప్రతీ కేటగిరీలో తక్కువ అయితే ఎంత ఉండాలి,ఎక్కువ అయితే ఎంత ఉండాలి అనే ధరలని ఫిక్స్ చేస్తూ తెలంగాణ హోం శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది.

ఏ కేటగిరీకి ఎంతంటే 

ఇక ప్రభుత్వం జీవోలో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే థియేటర్ల రకాలు, సీటింగ్ కేటగిరీల ఆధారంగా ధరలని చాలా స్పష్టంగా కేటాయించారు. నాన్ ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం సీట్లకు కనిష్ఠంగా రూ. 30, గరిష్ఠంగా రూ. 70 కాగా, ప్రీమియం సీట్లకు కనిష్ఠంగా రూ. 50, గరిష్ఠంగా రూ. 100గా నిర్ణయించారు. ఏసీ థియేటర్ల విషయానికి వస్తే, నాన్-ప్రీమియం కేటగిరీలో కనిష్ఠంగా రూ. 50 నుంచి గరిష్ఠంగా రూ. 150 వరకు, ప్రీమియం కేటగిరీలో కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 200 వరకు అమ్మవచ్చని తెలిపింది.ఇకపోతే స్పెషల్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్‌లలో నాన్-ప్రీమియం కేటగిరీ టికెట్ ధరను కనిష్ఠంగా రూ. 100 నుంచి గరిష్ఠంగా రూ. 250 వరకు ఖరారు చేస్తూ ప్రభుత్వం తుది ఉత్తర్వులు ఇచ్చింది.

ఒక్క రూపాయి ఎక్కువైనా సీరియస్ యాక్షన్

Advertisement

అయితే తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం భారీ బడ్జెట్ సినిమాలపై ఎఫెక్ట్ గట్టిగానే పడేట్టు కనిపిస్తుంది.ఇప్పటికే వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలకి ఈ రేట్లు ఏ మేరకి గిట్టుబాటు అవుతాయన్నది ఇపుడు పెద్ద క్వశ్చన్ మార్క్.గతంలో ఇలాంటి పెద్ద సినిమాల రిలీజ్ సమయాల్లో నిర్మాతలు హైకోర్టును లేదా ప్రభుత్వాన్ని ఆశ్రయించి తొలి వారం రోజుల పాటు రూ. 300 నుంచి రూ. 500 వరకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి, అర్ధరాత్రి ప్రీమియర్ షోలు మరియు ఎక్స్‌ట్రా షోలు వేసుకోవడానికి అనుమతులు తెచ్చుకునేవారు. కానీ సర్కార్ తెచ్చిన ఈ సరికొత్త రేట్ల ప్రకారం కాకుండా ఎక్కడైనా ఒక్క రూపాయి ఎక్కువగా వసూలు చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తేల్చి చెప్పింది.

ఎంతవరకు కలిసి వస్తాయో

ఒకవైపు స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్స్ దూకుడు, మరో వైపు అడ్డగోలుగా టికెట్ రేట్ల పెంపుతో థియేటర్ ల మొహాలే చూడని ఆడియన్స్ కి సర్కార్ తీసుకున్న ఈ డిసీషన్ ఒక మంచి బూస్టప్ అనే చెప్పాలి.ముఖ్యంగా సరదాగా బయటికి వెళ్లి గడిపి వద్దాం అనుకునే ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఇది పెద్ద రిలీఫ్.

Advertisement

మొత్తానికి తక్కువ బడ్జెట్లోనే ఏసీ థియేటర్లలో పెద్ద హీరోల సినిమాలు చూసే ఛాన్స్ వస్తుంది. అయితే భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసే బడా నిర్మాతలకు మాత్రం ఈ నిర్ణయం కాస్త మింగుడుపడని అంశమే. మొదటి వారంలోనే కలెక్షన్లు రాబట్టుకోవాలని చూసే బడా మేకర్స్ కి ఈ ఫిక్స్డ్ రేట్లు ఎంతవరకు కలిసి వస్తాయో వేచి చూడాలి మరి !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×