E-Paper
Advertisement

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!
Advertisement

Ram Pothineni: చిత్ర పరిశ్రమలో సెలబ్రిటీలు ప్రేక్షకులను అలరించడానికి తమ అద్భుతమైన నటనతో మెప్పించడమే కాదు.. అవసరం ఉన్నప్పుడు అభిమానులను ఆదుకుంటూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ముఖ్యంగా అభిమాన హీరోలను కలవాలని పరితపిస్తున్న ఎంతోమంది అభిమానులను నేరుగా కలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వంటి ఎంతోమంది హీరోలు అభిమానులను కలిసి వారి కోరికలు తీర్చగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి రామ్ పోతినేని (Ram pothineni)కూడా వచ్చి చేరారు. కేవలం మూడు నెలల వ్యవధిలో ఏకంగా ఇద్దరు లేడీ అభిమానులను కలిసి వారికి భరోసా ఇచ్చారు.

లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని..

అనపర్తికి చెందిన జెనెటిక్ లోపంతో బాధపడుతున్న చిన్నారి సాలడి శశికి రామ్ పోతినేని అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఆయన వీడియోలు చూస్తూ కాలం వెళ్ళదీస్తున్న ఆమె ఆయన వీడియోలు, ఫోటోలు చూస్తే తప్ప భోజనం చేయని పరిస్థితి.ఇక ఆమెను బ్రతికించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు చేయని పోరాటం లేదు.. ఎలాగైనా సరే రామ్ ను ఒక్కసారైనా కలవాలని కోరుకున్న ఆ చిన్నారికి కుటుంబ సభ్యులు అండగా నిలుస్తూ.. ఈ విషయాన్ని పలువురు సహాయంతో రామ్ పోతినేని వరకు చేరవేశారు. దీంతో విషయం తెలుసుకున్న రామ్ పోతినేని ఆ చిన్నారితో వీడియో కాల్ మాట్లాడి తన మంచి మనసు చాటుకున్నారు.

Advertisement

also read:మహాకాళి నుండి బిగ్ అప్డేట్.. మాస్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

గొప్ప మనసు చాటుకున్న రామ్..

జన్యుపరమైన సమస్యతో మంచానికే పరిమితమైన శశి రామ్ తో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకుందట. విషయం తెలుసుకున్న రామ్ స్వయంగా ఆమెకు వీడియో కాల్ చేసి మరీ మాట్లాడి ఆమెకు సంతోషాన్ని కలిగించారు. రామ్ ఆమెతో వీడియో కాల్ మాట్లాడుతున్నంతసేపు శశి ముఖంలో చిరునవ్వు అందరిని కదిలించింది. మొత్తానికి అయితే శశి కోరిక తీర్చి రామ్ మంచి మనసు చాటుకున్నారు.

ఆర్థిక భరోసా ఇచ్చిన రామ్..

Advertisement

ఇకపోతే ఆమెతో వీడియో కాల్ లో మాట్లాడిన రామ్ ఆమె ఆరోగ్యానికి అవసరమయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని ఆర్థికంగా భరోసా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె త్వరగా రికవరీ కావాలని, ఆమె వైద్యానికి ఎంత ఖర్చైనా పర్లేదని కామెంట్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరో అభిమానిని ఏకంగా కలిసిన రామ్..

మే నెలలో కూడా మరో అభిమానిని నేరుగా కలిసి ఆమె కోరికను తీర్చారు. విషయంలోకి వెళ్తే m.. గత 18 సంవత్సరాలుగా అరుదైన నరాల సంబంధిత వ్యాధి ఫ్రెడ్రిచ్ అటాక్సియాతో పోరాడుతున్న ఒక వీరాభిమాని కోరికను ఆయన స్వయంగా నెరవేర్చడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. తన అభిమాన హీరోని ఒక్కసారైనా కలవాలని ఆ యువతీ చాలా కాలంగా కోరుకుంటున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న రామ్ ఎటువంటి ప్రచారం లేకుండా నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు గడిపినట్టు సమాచారం.

మొత్తానికి అయితే అభిమానులను నేరుగా కలుస్తూ కుదిరితే వారితో వీడియో కాల్ మాట్లాడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు రామ్ అంటూ నెటిజన్లు అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×