E-Paper
Advertisement

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..

బ్రహ్మానందం అన్నయ్య భావోద్వేగం.. ఆ పిలుపు కోసం ఎదురు చూపంటూ..
Advertisement

Brahmanandam’s Brother Emotional:బ్రహ్మానందం ..ఈ పేరు వింటే చాలు మన పెదాలపై చిరు నవ్వు విరుస్తుంది.అలా భారతదేశంలోనే అత్యధిక సినిమాలలో నటించిన ఈ స్టార్ పర్సనల్ లైఫ్ గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ.అయితే తాజాగా బ్రహ్మానందం అన్నయ్య శ్రీ వదన్ బ్రహ్మానందం గురించి చేసిన పలు కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హైలెట్అయ్యాయి.బ్రహ్మానందం తనని కనీసం తాను ఉన్నానని కూడా గుర్తించట్లేదని ,తమ్ముడి నుండి అన్నయ్యా ఎలా ఉన్నావ్ అన్న ఒక్క పిలుపు కోసం ఎదురుచూస్తున్నానంటూ చెప్పిన చెప్పిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.

శ్రీ వదన్ గారు మాట్లాడుతూ తాము ఆరుగురు సంతానం అని,అందులో అక్క, తమ్ములు ఎవరూ బతికి లేదని,బతికి ఉన్నది తానూ, తన తమ్ముడు బ్రహ్మానందం అని తెలిపాడు.ఇక ఈ ఊరిలో మిగిలిపోయింది తానొక్కడినే అని తెలిపాడు.ఇక బ్రహానందం ఈ మధ్య ఊరికి వచ్చినా కనీసం కలవకుండా,పలకరించకుండా వెళ్లిపోయాడని వాపోయాడు.

అన్నయ్యా ఎలా ఉన్నావ్ అని అడిగితే చాలు

Advertisement

ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి అన్నయ్యా ఎలా ఉన్నావ్ అని అడిగితే చాలు, నాకు అంతకంటే ఏమీ వద్దు. గొప్ప స్థాయిలో ఉన్నవారు పలకరిస్తే చిన్నవారికి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.తాను నడవలేనని, అలాగని అతను ఇక్కడికి వస్తే జనాలు చుట్టుముట్టేస్తారని, కనీసం ఎవరైనా పంపి ఇక్కడ ఉన్నాను , లేదా హైదరాబాద్ లో ఉన్నాను రండి అంటే వెళ్తాను కదా అని బాధ పడిపోయారు.

షూటింగ్ రోజూ ఉండదు కదా, అస్తమానం బిజీగా ఎముండరు కదా..కనీసం తీరిక దొరికినప్పుడు ,లేదా వాష్ రూమ్ కి వెళ్లినప్పు డో ఫోన్ చేసి అన్నయ్యా ఎలా ఉన్నావు?ఏం చేస్తున్నావ్ అని అడిగితె అంతే చాలని,నాకు డబ్బు కూడా ఏమక్కరలేదని తన మనసులోని మాటల్ని బయటపెట్టారు.

సొంత అన్నయ్యనే పట్టించుకోవట్లేదా

Advertisement

తన కూతురు అన్నం పెడుతున్నారని, బ్రహ్మం గారి గుళ్ళో పూజారిగా చేస్తూ గడిపేస్తున్నాని,ఇక్కడ ఎప్పుడు ఎవరికీ ఏమవుతుందో తెలీదని బాధ పడ్డారు. నేను కోరుకునేదల్లా ఒక చిన్న పలకరింపు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి చాలా మంది నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.లెక్చరర్ నుండి పద్మశ్రీ వరకు ఎదిగిన బ్రహ్మానందం సొంత అన్నయ్యనే పట్టించుకోవట్లేదా అని చర్చించుకుంటున్నారు.

బ్రహ్మీ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో

బ్రహ్మానందం విషయానికి వస్తే గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం కనుమర్రు గ్రామానికి చెందిన బ్రహ్మానందం గారు మొదట్లో లెక్చరర్‌గా పనిచేసి, ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. దర్శకుడు జంధ్యాల గారు 1987లో విడుదలైన ‘అహ నా పెళ్ళంట!’ సినిమాతో ఆయనను వెండితెరకు పరిచయం చేశారు. ఆ సినిమాలో ‘అరగుండు’ పాత్రతో ఆయన చూపించిన  కామెడీ  సినీ చరిత్రలోనే నిలిచిపోయింది. ఆ తర్వాత 1993లో వచ్చిన ‘మాయాలోకం’, 1995లో ‘అల్లుడా మజాకా’, 2007లో ‘ఢీ’, 2008లో ‘రెడీ’, 2013లో ‘రేసుగుర్రం’2023లో ‘రంగమార్తాండ’, 2024లో ‘కీడా కోలా’ ఇలా ఎన్నో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న సంగతి తెల్సిందే .

ఇక ఈ వీడియో బ్రహ్మానందం గారు చూసి తన అన్నయ్యను పలకరిస్తే బాగుంటుందంటూ అభిమానులు కోరుకుంటున్నారు,చూడాలి మరి బ్రహ్మీ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో !

Tags

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×