Kantara 2 : కన్నడ ఇండస్ట్రీలో భారీ సంచలనం క్రియేట్ చేసిన సినిమా కాంతారా.. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా నటించారు. ఈ సినిమాకు ప్రీక్వెల్ ‘కాంతారా: చాప్టర్ 1’ 2025 ప్రేక్షకులు ముందుకు రాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ లొకేషన్లో ఇప్పటికే ఇద్దరు చనిపోవడంతో సినిమా విడుదల వాయిదా అవుతుందని అందరూ అనుకున్నారు.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. షూటింగ్ కాస్త పెండింగ్ ఉండడంతో ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలవుతుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు..
‘కాంతారా చాప్టర్ 1’ రిలీజ్ డేట్ ఫిక్స్..?
కాంతారా చాప్టర్ 1 రిలీజ్ డేట్ అక్టోబర్ 2, 2025 అని హొంబాళె ఫిలిమ్స్ ఇప్పటికే ప్రకటించింది. కానీ ఇటీవల ఈ తేదీ గురించి కొన్ని ఊహాగానాలు వ్యాపించాయి.. ఈ వార్తలపై స్పందించిన మన సంస్థ రిలీజ్ డేట్ పై ఎటువంటి అనుమానాలు లేవంటూ ప్రకటించింది. అన్నీ సజావుగా సాగుతున్నాయి. గతంలో వచ్చిన కాంతార సినిమా సక్సెస్ తరువాత కాంతార చాప్టర్ 1 ప్రేక్షకులను మరింత లోతుకిి తీసుకెళ్ళి.. చరిత్రను వివరంగా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా కథ సంస్కృతి, దైవత్వం లోకి తీసుకెళ్తుంది. ఈ మూవీకి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు కథను కూడా రాశారు. కాంతార ప్రీక్వెల్ కదంబ రాజుల కాలంలో జరుగుతుంది. రిషబ్ శెట్టి నాగ సాధువుగా అతీంద్రియ శక్తులున్న పాత్రలో నటించనున్నారు.. గతంలో వచ్చిన సినిమాకు మించి ఈ సినిమా స్టోరీ ఉండబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా పోస్టర్లు కూడా భయంకరంగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమా స్టోరీ భయంకరంగా ఉంటుందని అభిప్రాయానికి వచ్చేసారు.
‘కాంతారా’ స్టోరీ…
2022లో సెప్టెంబర్ 30న కాంతార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కర్ణాటకలో 250కి పైగా థియేటర్లలో విడుదలైంది. కేరళలో షూటింగ్ జరిగింది. కంబాల, భూత కోల సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా మనిషి, ప్రకృతి మధ్య సంఘర్షణను చూపించే కథ ఆధారంగా మూవీని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి కంబాల ఛాంపియన్ శివుడిగా, కిశోర్ ఫారెస్ట్ ఆఫీసర్ మురళిగా నటించారు. సప్తమి గౌడ హీరోయిన్. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమాకు ఊహించని విధంగా కలెక్షన్లు వచ్చి పడ్డాయి.
Also Read: హీరో మహేష్ బాబుకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా..?
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన ఈ సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. కన్నడ ఇండస్ట్రీ తో పాటుగా హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో డబ్ అయ్యి విడుదలైంది. కాంతార కర్ణాటక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ.. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకుంది. మరో ఇప్పుడు రాబోతున్న ఈ మూవీ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి..
Where legends are born and the roar of the wild echoes… 🔥#Kantara – A prequel to the masterpiece that moved millions.
Wishing the trailblazing force behind the legend, @shetty_rishab a divine and glorious birthday.
The much-awaited prequel to the divine cinematic… pic.twitter.com/0dTSh2lZ4k
— Hombale Films (@hombalefilms) July 7, 2025