Sithara entertainments : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఈ బ్యానర్ కి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రణరంగం, బుట్ట బొమ్మ వంటి సినిమాలు మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా మంచి కలెక్షన్లు తీసుకొచ్చాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా ఈ బ్యానర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఎందుకంటే హారిక బ్యానర్ ను కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేయటానికి ఫిక్స్ చేశారు.
యంగ్ హీరోలంతా ఈ బ్యానర్లో సినిమా చేయడానికి మగ్గుచూపుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమాను నిర్మించడం వేరు. నిర్మించిన సినిమాను ప్రేక్షకులు మధ్యకు తీసుకెళ్లడం వేరు. ఒక సినిమాను ఫ్రాక్షకులు ముందుకు తీసుకువెళ్లడానికి నిర్మాత నాగ వంశీ చేసే ప్రయత్నం మామూలుది కాదు. మీడియాకు కూడా చాలా సందర్భాలలో సెటైర్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. కొన్ని కారణాల వలన ఆ సినిమాను వాయిదా వేసిన సంగతి తెలిసింది. ఆ సినిమా రిలీజ్ డేట్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు.
మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రాబోయే కొత్త సినిమా గురించి కొద్దిసేపటి క్రితమే అనౌన్స్మెంట్ ఇచ్చారు. “మిడిల్ ఫింగర్ వాజే మ్యాన్” అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో చుట్టూ కెమెరాలు ఉన్నాయి. అంటే మీడియా విరుచుకు పడబోతుంది అనే అర్థం వచ్చేలా అనిపిస్తుంది. ఇక సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఆ సినిమా రాబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. వాస్తవానికి అది డీజెటిల్లు క్యూబ్ కావచ్చు. ఇదివరకే వచ్చిన స్క్వేర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. సిద్దు మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే సిద్దు చేసిన జాక్ సినిమా డిజాస్టర్ గా మారింది. ప్రస్తుతం తెలుసు కదా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్దు సిద్ధమవుతున్నాడు.
మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
మరోవైపు కింగ్డమ్ సినిమా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. నాగ వంశీ మాట్లాడుతున్న ప్రతిసారి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. మీరు ఈ సినిమా గురించి ఏం అడిగినా కూడా నేను ఆన్సర్ చెప్తాను అంటూ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అని ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కొత్త సినిమా అప్డేట్ ఇస్తుంటే మాకు ఏంట్రా బాబు ఇది అప్డేట్ ఇవ్వవా అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు.
Now he is the face of what they can’t control.
July 9th – No mercy 👊🏾🔥@vamsi84 @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/ADXtMFDuqs
— Sithara Entertainments (@SitharaEnts) July 6, 2025