E-Paper
Advertisement

పైకి నవ్వులు.. లోపల కత్తులు.. యోగి, అమిత్ షా మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా..?

పైకి నవ్వులు.. లోపల కత్తులు.. యోగి, అమిత్ షా మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా..?
Advertisement

Yogi Shah: దేశంలోని అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతోన్న తరుణంలో బిజెపిలో ఇద్దరు అగ్రనేతల మధ్య పొరపొచ్చాలు ఉన్నాయంటూ వస్తోన్న వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పైకి కలిసే ఉన్నట్లు కనపడుతోన్నా ఇద్దరి మధ్య ఏవో అభిప్రాయబేధాలు సమస్యలు ఉన్నట్లు హస్తిన వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సర్ ప్రక్రియపై సంచలనం..

భారతీయ జనతా పార్టీలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత పాపులర్ నేతలుగా ముద్ర పడ్డది ఇద్దరే. ఒకరు యూపీ సిఎం యోగి కాగా రెండోది అమిత్ షా. మోదీ అమిత్ షాల జోడీ మధ్య కెమిస్ట్రీ ఎప్పుడూ బాగుంటుందంటారు. అదే విధంగా యోగి-మోదీల మధ్య కూడా అండర్ స్టాండింగ్స్ బానే ఉంటాయని అంటారు. కానీ యోగి-అమిత్ షాల మధ్యనే వాతావరణం కూల్ గా లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నరేంద్ర మోదీ తర్వాత ప్రధాని పీఠం అధిరోహించగల వారసులిగా ఈ ఇద్దరి పేర్లూ వినిపిస్తాయి. ఆ రేసులోనే ఇద్దరి మధ్య తెలీని పోరు నడుస్తోందేమో అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కొద్ది రోజుల క్రితం యోగి సర్ ప్రక్రియపై సంచలన వ్యాఖ్య చేశారు.

హిందువుల ఓట్లు గల్లంతు..

Advertisement

యూపీలో సర్ కారణంగా 1.27 కోట్ల హిందువుల ఓట్లు గల్లంతు అయ్యాయని యోగి ఆరోపించారు. దీనిపై రాజకీయ దుమారమే లేచింది.ఈ వ్యాఖ్య ఆయన ఎందుకు చేసినా ఇది విపక్షాలకు అస్త్రంగా మారింది. యోగి వ్యాఖ్యలపై అమిత్ షా చాలా గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి. అసలు సర్ లో ఓట్లు గల్లంతు కావడం లేదని ప్రధానితో పాటు తాను పదే పదే చెబుతోంటే ఓట్ల గల్లంతుపై విపక్షాల ఆరోపణలకు ఊతమిచ్చేలా యోగి వ్యాఖ్యానించడం పట్ల అమిత్ షా సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. అయితే పైకి మాత్రం ఇద్దరూ ఒకరినొకరు పొగుడుకుంటూనే ఉన్నారు. యోగి అద్భుతమైన పాలకుడని షా కొనియాడితే షా నేతృత్వంలో దేశంలో లాఅండ్ ఆర్డర్ బాగుందని యోగి అంటున్నారు. కానీ ఇద్దరి మధ్య కనిపించిన ఆయుధాలు యుద్దం చేసుకుంటున్నాయని రాజకీయపరిశీలకులు అనుమానిస్తున్నారు.

Also read: ఒక్క పాటతో ‘రియాలిటీ’పై అంచనాలు పెంచేసిన కిరణ్ అబ్బవరం!

Tags

Related News

భార్య ఏడ్చినంత మాత్రాన భర్త వేధించనట్లేనా? ఆత్మహత్య, 498A కేసులో కోర్టు కీలక తీర్పు

రసగుల్లా అని నమ్మించి.. నాటు బాంబు ఇచ్చారు.. నోట్లో వేసుకోగానే పేలి వ్యక్తి మృతి!

డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

భార్య వంట చేయడం లేదని విడాకులిచ్చిన భర్త.. కోర్టు తీర్పు ఇదే

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ కంపెనీ వైస్ ఛైర్మన్‌తోపాటు ఫ్యామిలీ మృతి, ఘటన ఎలా జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

Big Stories

Advertisement
×