Daksha Nagarkar..దక్ష నాగర్కర్ (Daksha Nagarkar).. కన్నడ, తెలుగు సినిమా నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. 2007లో కన్నడ సినిమా ‘భూగత ?’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2015 లోనే ‘ఏకే రావు పీకే రావు’ అనే సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. 2021లో విడుదలైన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ (Teja Sajja) కూడా హీరోగా అవతారం ఎత్తారు. ఆ తర్వాత బంగార్రాజు, రావణాసుర, లవ్ మీ , స్వాగ్ వంటి చిత్రాలలో కూడా నటించి ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె హైదరాబాదులో సందడి చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అమ్జద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సలోన్ ప్రారంభించిన దక్ష..
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులోని అల్కాపూర్ లో ఏర్పాటుచేసిన అమ్జద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సలోన్ ను ఈమె ప్రారంభించింది. ఈ సందర్భంగా దక్ష నాగర్కర్ మాట్లాడుతూ.. ” ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడమే నా గ్లామర్ రహస్యం” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సలోన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఈమె పలు విషయాలను పంచుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర..
ఇకపోతే మహేష్ బిజినెస్ హెడ్ ఆపరేషన్స్ మాట్లాడుతూ.. “సలోన్ ఇండస్ట్రీలోనే అతి తక్కువ కాలంలో కస్టమర్స్ దగ్గర మంచి పేరు సొంతం చేసుకున్న ఏకైక సలోన్ అమ్జద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సలోన్. 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రతో మా సలోన్స్ విజయవాడ, మియాపూర్, కూకట్పల్లి, నల్లగండ్ల, కోకాపేట్ ఇప్పుడు హైదరాబాద్ లోని అల్కాపూర్ లో ఎనిమిదవ అమ్జద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ ప్రీమియం సలోన్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది” అంటూ తెలిపారు.
అమ్జద్ హబీబ్ ఒక గొప్ప హెయిర్ స్టైలిస్ట్..
అలాగే సలోన్ నిర్వాహకులు విజయలక్ష్మి, సంతోష్ మాట్లాడుతూ.. అమ్జద్ హబీబ్ ఒక గొప్ప హెయిర్ స్టైలిస్ట్. గత 16 సంవత్సరాల పాటుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ కూడా. చాలామంది ఈయనను తమ హెయిర్ స్టైలిస్ట్ గా నియమించుకున్నారు. ఇకపోతే అలాంటి వ్యక్తి సలోన్ బ్రాండ్ ను మనం మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. సలోన్స్ ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తులు ఉపయోగించి హెయిర్ కేర్ సేవలను అందిస్తున్నాయి అంటూ వారు తెలిపారు.
ALSO READ: Nikki Tamboli: 1000 కారణాలు అంటూ బ్రేకప్ పై తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్!