Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ వారం ఈ కార్యక్రమంలో భాగంగా సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ప్రముఖ సినీ నటి సురేఖ వాణి(Surekha Vani) కుమార్తె సుప్రీత(Supritha) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈమె కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను, తన తల్లిదండ్రుల గురించి కూడా తెలిపారు. ఇకపోతే వర్ష ప్రశ్నలు వేస్తూ తన సంపాదన గురించి కూడా అడిగారు.
ప్రస్తుతం సుప్రీత బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తున్నారు అదేవిధంగా ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ ఛానల్ వంటి వాటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నెల సంపాదన ఎంత అంటూ వర్షా ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సుప్రీత సమాధానం చెబుతూ ప్రతినెలా ఇంత వస్తుందని లేదు ,తనకున్న ఎపిసోడ్స్ బట్టి తన సంపాదన పెరగడం, తగ్గడం అనేది ఉంటుందని చెప్పారే తప్ప, తన సంపాదన ఎంత అనే విషయాన్ని మాత్రం ఈమె వెల్లడించలేదు. ఇలా సుప్రీత చేస్తున్న ప్రాజెక్ట్ బట్టి చూస్తుంటే ఈమె నెలకు లక్షల్లోనే ఆదాయం అందుకుంటుందని తెలుస్తోంది.
ఇలా లక్షల్లో ఆదాయం అందుకుంటున్న సుప్రీత తరచూ తన తల్లితో కలిసి వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు అలాగే వివిధ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇలా లక్షల్లో సంపాదిస్తున్న సుప్రీత ప్రతినెల అందం కోసం ఎంతవరకు ఖర్చు చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే తాను తన మెయింటెనెన్స్ కోసం నెలకు 30 నుంచి 40 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. లక్షల్లో ఆదాయం అందుకుంటున్న ఈమె తన మెయింటైనెన్స్ కోసమే 40 వేల రూపాయలు ఖర్చు చేస్తానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే సుప్రీత ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏదో ఒకటి ట్రిప్ వేస్తూనే ఉంటారు. ఇలా ట్రిప్ వెళ్ళిన ప్రతిసారి ఎంత ఖర్చవుతుంది అనే విషయాన్ని కూడా వెల్లడించారు. తాము ఒక వెకేషన్ వెళితే ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు చేసుకొని వస్తామని తెలిపారు. ఇలా ఇప్పటికే తాను తనకు నచ్చిన ప్రదేశాలన్నింటిని చూసి వచ్చాను కానీ ఒకే సంవత్సరంలోనే తనకు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని కోరికగా ఉంది ఇప్పటివరకు ఆ కోరిక నెరవేరలేదని సుప్రీత తెలిపారు. ఇక ఈ ఏడాది శ్రావణ మాసంలో ఒక ఐదు జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని భావిస్తున్నాను అంటూ ఈమె తన కోరికను కూడా తెలిపారు.
Also Read: డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!