E-Paper
Advertisement

యూత్‌ను టార్గెట్ చేసిన ‘రోమాంచకం’.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది!

యూత్‌ను టార్గెట్ చేసిన ‘రోమాంచకం’.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది!
Advertisement

Romanchakam Trailer: అగ్రెస్సివ్ అండ్ ఇంటెన్స్ సినిమాలు తీసే దర్శకుడి నుండి ఒక సినిమా ప్రొడ్యూస్ అవుతుందంటే ఎలా ఉంటుందా అని క్యూరియస్ గా వాచ్ చేశారంతా.

ముఖ్యంగా మేమ్ ఫేమస్ సినిమాతో మంచి ఈజ్ ఉందని ప్రూవ్ చేసుకున్న సుమంత్ ప్రభాస్, మ్యాడ్ మరియు 8 వసంతాలు సినిమాలతో సత్తా చాటిన అనంతిక సానిల్‌కుమార్ జంటగా రోమాంచకం అనే సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి.ఇకవేణు గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ రిలీజ్ కాగా సినిమా అలా ఉంటుంది , ఇలా ఉంటుంది అంటూ అప్పుడే విశ్లేషించడం మొదలెట్టారు నెటిజన్లు.

ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు

Advertisement

ఇక రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే ఇది సాధారణ లవ్ స్టోరీ కాదు అని క్లియర్ గా క్లారిటీ వచ్చేసింది. మొదట్లో ఒక క్యూట్, లైట్ హార్టెడ్ రొమాంటిక్ రైడ్‌లా మొదలయిన స్టోరీ ని చూస్తే అరె ఇదేదో సింపుల్ గా సాగిపోయెలా ఉందే అనిపిస్తుంది.హీరో హీరోయిన్ల పరిచయం, వాళ్ల మధ్య నడిచే ఫన్నీ సీన్లు, ఒకరికొకరు కనెక్ట్ అయ్యే విధానం చూస్తే ఆ అంచనాలకి బలం చేకూర్తుంది కూడా.

ఊహించిన దానికి భిన్నంగా

కానీ క్రమంగా ట్రైలర్ సాగుతున్న కొద్దీ నేటి తరం రిలేషన్‌షిప్స్‌లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? కేవలం ప్రేమ మాత్రమే కాకుండా ఈగోలు, కమ్యూనికేషన్ గ్యాప్, బ్రేకప్స్ భయం, అపార్థాలు ఎలా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయి అనే పాయింట్ ని ఎత్తుకొని మీరు ఊహించిన దానికి భిన్నంగా సాగుతుందని హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ప్రస్తుతం ఉన్న యూత్ తమ రిలేషన్‌షిప్‌లో ఏదో ఒక సమయంలో ఫేస్ చేసే ఎమోషన్స్‌ను చాలా సహజంగా తెరపైకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది.

వీరిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్ 

Advertisement

ఇక సినిమాలో చేసిన నటీనటుల విషయానికి వస్తే, సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పాలి. లవర్ బాయ్‌లా క్యూట్‌గా కనిపిస్తూనే, ఎమోషనల్ అండ్ సీరియస్ సీన్స్‌లో మంచి మెచ్యూరిటీ చూపించాడు సుమంత్.అనంతిక కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుందనే చెప్పాలి.ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీ ట్రైలర్‌ను చాలా ఫ్రెష్‌గా మార్చేసిందనడంలో ఎలాంటి సందేం లేదు.ముఖ్యంగా ట్రైలర్ లో వచ్చిన ”అటూ ఇటూ ఊగులాడుతున్న నా అమరకావ్యం ..రాస్తే రామాయణం..తీస్తే రోమాంచకం అవుతుంది ”అనే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది.

ఇక వాసుకి వైభవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ కి మెయిన్ ఎసెట్. ఇక ట్రైలర్ లో వచ్చిన డైలాగ్స్ కూడా చాలా క్యాచీగా ఉండటంతో యూత్ ఈజీగా కనెక్ట్ అయిపోతున్నారు.

బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో

మొత్తంగా పెద్ద స్టార్లు లేకపోయినా స్ట్రాంగ్ కంటెంట్, యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో థియేటర్లకు ఆడియన్స్‌ను రప్పించవచ్చని ఈ సినిమా నిరూపించేలా ఉంది. సందీప్ రెడ్డి వంగా ప్రెజెన్స్ సినిమాకు మంచి హైప్ తెచ్చినట్టే కనిపిస్తుంది. చూడాలి మరి సెప్టెంబర్ 3న థియేటర్లలోకి రానున్న ఈ ‘రోమాంచకం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !

Tags

Related News

హైదరాబాద్‌లో ఈ థియేటర్లు ఉండేవని తెలుసా..?

మహేష్–అనిల్ కాంబోకు బ్రేక్? దర్శకుడి మాటల్లో అసలు మ్యాటర్!

ఇరుముడిలో నాగులు.. ఈ క్యారెక్టర్‌ వెనుక ఇంత కథ ఉందా?

తెలుగు ఒక్క ముక్క కూడా రాదు.. కానీ ఇరుముడిలో మాత్రం ఇరగదీసింది!

తండ్రి మొదటి కారు కోసం విష్ణు మంచు ఇంత చేశాడా?

అయ్యప్ప భక్తుడిగా మారిన డేవిడ్ వార్నర్..

మళ్లీ వివాదంలో చిక్కుకున్న శ్రీకాంత్ అయ్యంగర్!

Big Stories

Advertisement
×