అలా కనుమరుగు అయిపోయిన థియేటర్లలో ప్రముఖమైన థియేటర్ సాగర్ టాకీస్. అబిడ్స్‌లో 1925లో ప్రారంభమైన ఈ థియేటర్‌కు అంతకుముందు ఎక్సెల్ షేర్ థియేటర్ అనే పేరు ఉండేది.అయితే ఆ కాలంలో అప్పట్లో సినిమా ఇప్పటిలా ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. కాబట్టి ఇలాంటి థియేటర్లు హైదరాబాదు ప్రజలకి ఒక మంచి ఎంటర్ టైన్మెంట్ అందించే వాటిలో ప్రముఖంగా ఉండేవి.
ఇక అబిడ్స్-కోటి ప్రాంతంలో 1934లో ఏర్పడ్డ జమ్రుద్ మహల్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందినదే .నవాబ్ గులాం హుస్సేన్ ఖాన్ నిర్మించిన ఈ థియేటర్ కూడా అప్పటి హైదరాబాద్ సినిమా సంస్కృతిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాత హైదరాబాద్ వాతావరణం, థియేటర్ సంస్కృతి రెండూ కలిసిన కాలానికి ఇది ఒక గుర్తుగా చెప్పొచ్చు.
ఇక 1969 లో సికింద్రాబాద్, శివాజీనగర్‌లో కట్టిన సంగీత్ థియేటర్ అప్పట్లో ట్రెండ్‌సెట్టర్. అసలు థియేటర్ అంటే ఎలా ఉండాలో రాబోయే తరాలకు సరికొత్త అనుభవాన్ని పరిచయం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక 1939లో సుల్తాన్ బజార్ లో కట్టిన దిల్‌షాద్ టాకీస్ పాతబస్తీ పరిసరాల్లో సినిమా వ్యాపారం ఆరోజుల్లో ఎంత జోరుగా సాగేదో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.
ఇక 1932 లో గుల్జార్ హౌజ్ లో కట్టిన కృష్ణా టాకీస్ అంటే ఒక క్రేజ్ ఉండేది.అప్పట్లో ఈ థియేటర్‌కు వెళ్లడమంటే కేవలం సినిమా చూడటం ఒకటే కాదు కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయడం, విజిల్స్ వేయడం..అబ్బో ఒక పెద్ద పండుగలా ఉండేదట.
also read :యూత్‌ను టార్గెట్ చేసిన ‘రోమాంచకం’.. ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది!
ఇక అబిడ్స్ లో మొదట చిన్న షాప్‌గా ఉన్న ప్రదేశాన్ని మొదటగా ‘సెలెక్ట్ థియేటర్’గా కట్టగా తర్వాతి కాలంలో అది’ప్యాలెస్ థియేటర్’గా మార్చారు. నగరంలో సినిమాలకు పెరిగిన డిమాండ్‌కు ఇది నిదర్శనం అని చెప్పకతప్పదు.
ఇక 1935లో లాల్ దర్వాజాలో కట్టిన ఆర్గస్ థియేటర్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ పేరుతోనే నారాయణగూడ, అగాపురాల్లో కూడా బ్రాంచ్‌లు ఉండేవి కూడా.ఇక ఒకే బ్రాండ్ పేరుతో వేర్వేరు చోట్ల థియేటర్లు ఉన్నాయంటే అప్పట్లోనే సినిమా బిజినెస్ ఎంతగా విస్తరించిందో ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
ఇక సుల్తాన్ బజార్ లో1920లో ‘ప్రేమ్ థియేటర్’గా ఏర్పడ్డ థియేటర్ క్రమంగా మరిన్ని హంగులు సమకూర్చుకుని 1932లో ‘మోతీ మహల్’గా మారింది. కానీ దురదృష్టవశాత్తూ 1936లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఈ థియేటర్ పూర్తిగా కాలిపోయింది.
ఇక సుల్తాన్ బజార్‌లో1927లో కట్టిన రాయల్ టాకీస్, సికింద్రాబాద్ మార్కెట్ స్ట్రీట్‌లో 1926లో కట్టిన రాజేశ్వరి టాకీస్‌లు నాటి పాత హైదరాబాద్ సినిమా చరిత్రలో చాలా ముఖ్యమైనవిగా చెప్పుకోవాలి.
ఇక 1960లో హిమాయత్‌నగర్ లో కట్టిన లిబర్టీ థియేటర్ అప్పట్లో ఒక సంచలనం. థియేటర్ కాల క్రమంలో మూతపడినా, ఇప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అందరూ ‘లిబర్టీ’ అనే పిలుస్తున్నారంటే ఆ థియేటర్ కి ఎంతటి క్రేజ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
also read :మహేష్–అనిల్ కాంబోకు బ్రేక్? దర్శకుడి మాటల్లో అసలు మ్యాటర్!
ఏది ఏమైనా ఇప్పుడు సింగిల్ స్క్రీన్లు తగ్గిపోతున్నాయి. మల్టీప్లెక్సులు పెరుగుతున్నాయి. టికెట్ బుకింగ్ ఫోన్‌లోనే అయిపోతోంది. కానీ ఒకప్పుడు హైదరాబాద్ వీధుల్లో వెలిగిన ఈ థియేటర్ల కథలు మాత్రం నగర సినిమా చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు !