E-Paper
Advertisement

రాఖీ పండుగ సందర్బంగా మంచి లగ్జరీ ట్రీప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో

రాఖీ పండుగ సందర్బంగా మంచి లగ్జరీ ట్రీప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఆప్షన్స్ ఇవిగో
Advertisement

Raksha Bandhan Travel| రక్షాబంధన్ మరి కొన్ని రోజుల్లో అంటే ఆగస్టు 28, శుక్రవారం వస్తోంది. ఈ పండుగ సందర్భంగా చాలా మంది బ్రదర్స్, సిస్టర్స్ కలిసి టూర్ ప్లాన్ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కంటే కలిసి ప్రయాణించడం వల్ల స్వీట్ మెమోరీస్ లభిస్తాయి. భారతదేశంలో బీచ్‌లు, కొండలు, అడవులు, రాజభవనాలు, విలాసవంతమైన రిసార్ట్స్ వంటి ఎన్నో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి.

గోవాలో ప్రశాంతమైన సముద్రతీర విహారయాత్ర

ది సెయింట్ రెజిస్ గోవా రిసార్ట్ కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి మంచి ఎంపిక. స్విమ్మింగ్ పూల్, మంచి ఆహారం, బీచ్ అనుభూతులతో సోదరులు సమయాన్ని ఆస్వాదించవచ్చు. ది ఆస్టర్ గోవా మరింత ప్రైవేట్ అనుభూతిని కోరుకునేవారికి బాగుంటుంది. విశాలమైన సూట్ రూమ్స్, మంచి భోజనం, వర్షాకాలంలో పచ్చదనం ఈ ట్రిప్‌ను ప్రత్యేకంగా మారుస్తాయి. షెరటన్ గ్రాండ్ చెన్నై రిసార్ట్ అండ్ స్పా గోవాకు వెళ్లకుండా సముద్రతీర విహారయాత్ర చేయాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది.

ప్రకృతి మధ్యలో రిలాక్స్ అవ్వాలనుకునే వారి కోసం మంచి డెస్టినేషన్స్

Advertisement

ది లీలా కూర్గ్ ఫారెస్ట్ శాంక్చువరీ కాఫీ, ప్రకృతిని ఇష్టపడే సోదరులకు మంచి ఎంపిక. ఇక్కడ కాఫీ తయారీ విధానం తెలుసుకుని, టేస్టింగ్ అనుభవాన్ని కలిసి ఆస్వాదించవచ్చు. లే మెరిడియన్ మహాబలేశ్వర్ రిసార్ట్ అండ్ స్పా అడవులు, కొండలు, పూల్, స్పా అనుభవాలను అందిస్తుంది. రాడిసన్ బ్లూ రిసార్ట్, కర్జత్ నగర జీవితానికి దూరంగా కొండలు, పచ్చదనం మధ్య ప్రశాంతమైన సమయాన్ని అందిస్తుంది.

హిమాలయాల మధ్య ప్రశాంతమైన సమయం

నోర్బు ది మోంటన్నా, ధర్మశాల కొండలు, దేవదారు అడవులు, వెల్‌నెస్ అనుభవాలతో ఆకట్టుకుంటుంది. సోదరులు మెడిటేషన్, సౌండ్ హీలింగ్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. నౌకుచియా హౌస్ సరస్సు, అడవులు, కొండల మధ్య నెమ్మదిగా సమయాన్ని గడపడానికి అనువుగా ఉంటుంది. ది నైనీ రిట్రీట్ నైనిటాల్ సరస్సు అందాలతో పాటు వారసత్వ అనుభూతిని అందిస్తుంది.

రాజస్థాన్‌లో రాజసమైన అనుభూతి

Advertisement

ది లీలా ప్యాలెస్ జైపూర్ విలాసవంతమైన వసతి, స్పా, రాజస్థానీ ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకుంటుంది. సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా చారిత్రక కోట వాతావరణాన్ని ఆధునిక వెల్‌నెస్ అనుభవాలతో కలుపుతుంది. నరేంద్ర భవన్, బికనీర్ రాజస్థాన్ చరిత్ర, వాస్తుశిల్పం, స్థానిక సంస్కృతిని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునేవారికి సరిపోతుంది.

అడవుల్లో సాహస యాత్ర

ది ఒబెరాయ్ వన్యవిలాస్ రణతంభోర్ సమీపంలో వన్యప్రాణులు చూస్తూ అడవిలో మంచి అనుభూతి పొందవచ్చు. సోదరులు టైగర్ సఫారీతో స్పెషల్ మెమోరీస్ కూడా సృష్టించవచ్చు. ది ఒబెరాయ్ వింధ్యవిలాస్ బాంధవ్‌గఢ్ సమీపంలో సఫారీలు, ప్రకృతి అనుభవాలు, వెల్‌నెస్ సౌకర్యాలను అందిస్తుంది. తాజ్ కార్బెట్ రిసార్ట్ అండ్ స్పా, నది, అడవులు, పక్షుల వీక్షణ, స్పా అనుభవాలతో విహారయాత్ర ప్రశాంతంతా సాగుతుంది.

Also Read: రాఖీ పండుగకు బాలీవుడ్ టచ్.. అమ్మాయిలకు స్టైలిష్ డ్రెస్‌లు

ఢిల్లీ సమీపంలో స్టేకేషన్

ప్రయాణ సమయాన్ని తగ్గించాలనుకునేవారు ది లోధి లేదా ది లీలా ప్యాలెస్ న్యూఢిల్లీలో స్టేకేషన్‌ను ఎంచుకోవచ్చు. స్పా, విలాసవంతమైన గదులు, మంచి రెస్టారెంట్లు, పూల్ వంటి సౌకర్యాలతో నగరంలోనే హాలిడే అనుభూతిని పొందవచ్చు. తాజ్ సూరజ్‌కుండ్ రిసార్ట్ అండ్ స్పా, తాజ్ దమ్దమా లేక్ రిసార్ట్ అండ్ స్పా కూడా ఢిల్లీ సమీపంలో ప్రశాంతమైన ఎంపికలు.

ఈ రక్షాబంధన్‌కు సమయమే అసలైన బహుమతి

రక్షాబంధన్ సందర్భంగా ఖరీదైన వస్తువులకు బదులుగా కలిసి గడిపే సమయాన్ని బహుమతిగా ఇస్తే స్వీట్ మెమోరీస్ ఏర్పడతాయి. బీచ్, కొండలు, అడవులు, రాజభవనాలు లేదా స్టేకేషన్ ఎంచుకున్నా అనుభవమే ముఖ్యమైనది. ఈ రక్షాబంధన్‌ను మరపురాని జ్ఞాపకాలతో నింపేందుకు సోదరుడితో లేదా సోదరితో కలిసి ప్రత్యేక ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.

Also Read: రాఖీ పండుగ రోజు స్పెషల్‌గా కనిపించాలా? అబ్బాయిల కోసం ట్రెండీ అవుట్‌ఫిట్ ఐడియాలు ఇవిగో

Related News

‘ఇరుముడి’ మూవీలోని ఈ లోకేషన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఫిదా అయిపోతారు!

కారు నిండా ముద్దులు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్, పాపం ప్రియుడు!

దేశంలో ఫస్ట్ హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ రెడీ.. వందే భారత్‌కు మించి వేగంతో దూసుకెళ్లనున్న రైళ్లు!

సముద్రంలో ఈ పసుపు గుర్తు కనిపిస్తే జాగ్రత్త! ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు మరాఠీ తప్పనిసరి ఎందుకు చేశారు? కారణాలేంటీ?

బ్రిటీషర్ల నాటి వైభవం.. మన దేశంలోనూ ‘లండన్’ ఉందోచ్.. విశేషాలు ఇవే!

మెట్రో రైలుకు గ్లోబల్ గుర్తింపు, ఆ సర్టిఫికేషన్ సాధించిన తొలి సంస్థగా..

Big Stories

Advertisement
×