E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం నుంచి తప్పుకున్న హర్షవర్ధన్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?

ఆదర్శ కుటుంబం నుంచి తప్పుకున్న హర్షవర్ధన్.. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే?
Advertisement

Aadarsha Kutumbam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్(Venkatesh) హీరోగా ఆదర్శ కుటుంబం(Aadarsha Kutumbam) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాదులోనే ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ పనులను కూడా నిర్వహిస్తున్నారు.

ఆదర్శ కుటుంబంలోకి ఎస్ఎస్ తమన్ 

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రమేశ్వరన్(Harshavardhan rameswaran ) ను ఎంపిక చేశారు. ఈయన ఈ సినిమా కోసం కొంత భాగం పనులను కూడా పూర్తి చేశారు. అయితే ఉన్నఫలంగా ఇప్పుడు ఈ సినిమా నుంచి హర్షవర్ధన్ రమేశ్వరన్ తప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా హర్షవర్ధన్ తప్పుకోవడంతో ఈ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ రంగంలోకి దిగారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్..

Advertisement

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎస్ ఎస్ తమన్ కాంబినేషన్లో ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో అలా వైకుంఠపురం, అఆ , గుంటూరు కారం వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ సినిమాలన్నీ కూడా మ్యూజికల్ పరంగా పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వెంకటేష్ ఆదర్శ కుటుంబం కూడా రాబోతుందని తెలియగానే ఈ సినిమా పట్ల మంచి అంచనాలు కూడా ఉన్నాయి.

హర్షవర్ధన్ తప్పుకోవడానికి అదే కారణమా?

Advertisement

ఇక ఈ సినిమా నుంచి హర్షవర్ధన్ రమేశ్వరన్ తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఆరా తీయడం మొదలుపెట్టారు. హర్షవర్ధన్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇలా మంచి టాలెంట్ కలిగినటువంటి హర్షవర్ధన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణం డేట్స్ అడ్జస్ట్ కానీ నేపథ్యంలోనే తప్పుకున్నారా లేదంటే మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ సినిమా నుంచి హర్షవర్ధన్ తప్పుకొని ఎస్ఎస్ తమన్(S.S.Thaman) రంగంలోకి దిగడంతో తమన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: టెలివిజ న్ ప్రీమియర్ కు సిద్ధమైన ప్రభాస్ సినిమా.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Related News

ఈసారి అయినా హిట్ కొడతావా నితిన్?

రష్మికకు ఏం జరిగింది?.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు నిజం బయటకు!

టార్చర్ పెట్టకండి.. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య అభ్యర్థన!

హీరోయిన్‌గా నందమూరి తేజస్విని.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

చిన్న విషయాలకే వణికిపోయే స్టార్ హీరోయిన్లు వీళ్లే!

పాన్ ఇండియా స్టార్ కావాలంటే.. ఇప్పుడు కత్తి పట్టాల్సిందేనా?

చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

సౌత్ స్టైల్‌లో ‘స్పైడర్ మ్యాన్’కు పెళ్లి.. అతిథులుగా అవేంజర్స్, ఏం క్రియేషన్ భయ్యా!

Big Stories

Advertisement
×