Mornie Morkel : ఆసియా కప్ 2025 ఇవాళ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రేపు టీమిండియా వర్సెస్ ఆతిథ్య యూఏఈ జట్టు తలపడనున్నాయి. ఇక ఆ తరువాత టీమిండియా.. దాయాది పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది. పాకిస్తాన్ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తో టీమిండియా మ్యాచ్ ఆడొద్దని.. కొందరూ ఆడాలని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బీసీసీఐ పై కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని మ్యాచ్ లకు బీసీసీఐ ఫర్మిషన్ ఇస్తుంది. మరికొన్ని మ్యాచ్ లకు ఎందుకు ఫర్మిషన్ ఇవ్వదని నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెట్ పాకిస్తాన్ పై మ్యాచ్ పై స్పందించారు.
Also Read : Sachin-Sara : సచిన్ కు షాక్… సంపాదనలో తండ్రిని దాటిన సారా టెండూల్కర్.. ఒక్క పోస్టుకు ఎంత రేటు అంటే
ఆసియా కప్ లో ముఖ్యంగా పాకిస్తాన్ జట్టును అంతా తేలికగా తీసుకోబోమని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్మీ మోర్కెల్ తెలిపారు. పాక్ తో సవాల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నామని.. ఆ జట్టు బలాలు, బలహీనతలను విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. తమ నియంత్రణలో ఉన్న అంశాలపైనే దృష్టి పెడతామన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్, బౌలింగ్ చేసేలా ఆల్ రౌండర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కాగా భారత్, పాక్ మ్యాచ్ ఈనెల 14న జరుగనున్నది. మరోవైపు తాజాగా ఆసియా కప్ 2025 సందర్భంగా 8 జట్ల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ మాట్లాడారు. “ఆసియా కప్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ కదా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ విషయం మీకు ఎవ్వరూ చెప్పారు. నేనైతే ఎక్కడ వినలేదు. మేము సుదీర్ఘకాలంగా టీ20ల్లో అత్యుత్తమంగా రాణిస్తున్నాం. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో టోర్నీకి సిద్ధంగా ఉన్నామని అయితే చెప్పగలను. ముఖ్యంగా మైదానంలో దూకుడుగా ఉండటం చాలా కీలకం. అసలు అగ్రెషన్ గ్రౌండ్ కి ఎలా వెళ్లగలము..? ఈ సారి కూడా మేము అలాగే చేస్తాం” అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక ఆటగాళ్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎలాంటి నష్టం కలిగించదని వెల్లడించాడు. గత కొంతకాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండటంతో ఆసియా కప్ కి సెలెక్ట్ చేయలేదు సెలక్టర్లు. వాస్తవానికి సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కి చెందిన ఆ ఇద్దరూ కీలక ఆటగాళ్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనడం ఇదే మొదటి సారి అని చెప్పాడు సల్మాన్ అలీ అఘా. టీ-20 క్రికెట్ లో ఏ జట్టు పేవరేట్ కాదు.. తమదైన రోజుల ప్రతీ జట్టు అద్భుతాలు చేస్తుంది. ఒకటి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని తెలిపారు.