BigTV English

Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

Weather News: ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వర్షం.. పిడుగులు పడుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి

Weather News: గడిచిన నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తాజాడి గత మూడు, నాలుగు రోజుల రాష్ట్రం పలు చోట్ల మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్టేట్ ఇచ్చారు. మరో ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.


ఇవాళ నార్త్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు. హైదరాబాద్ రోజంతా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పారు. రాత్రంతా భాగ్యననగరంలో పలు చోట్ల తేలకపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉందని అన్నారు.

ALSO READ: Komuram Bheem District: రాష్ట్రంలో దారుణ ఘటన.. నీటి మడుగులో పడి తల్లి, ముగ్గురు కూతుర్లు మృతి


రాబోయే 2 గంటల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, అలాగే రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో అల్వాల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కాప్రా, ఈసీఐఎల్, నేరేడ్ మెట్, మౌలాలి, నాగారం, మల్లాపూర్ ప్రారంతాల్లో మరి కాసేపట్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: PM Modi: మణిపూర్ ప్రజలకు నేనున్నా… మీకు ఏది కావాలన్నా నాదే భరోసా: ప్రధాని మోదీ

భారీ వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిన్న పలు చోట్ల పిడుగు పడి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడకూడదని వివరించారు.

Related News

Hyderabad Chutneys: చట్నీస్ రెస్టారెంట్లపై అధికారులు దాడులు.. కిచెన్లలో బొద్దింకలు, ఎలుకులు.. కంపువాసన

Warangal Congress Clash: వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన విభేదాలు..

Krishna Water Dispute: ఈ నెల 23న ఢిల్లీలో.. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్-2 సమావేశం

Drug Racket: స్కూల్ ముసుగులో.. మత్తు పదార్థాల దందా..

Jagga Reddy Humanity: కళ్లు కనిపించని ఆ బాలుడి పాట విని చలించిపోయిన జగ్గారెడ్డి.. స్పాట్‌లోనే ఎన్ని లక్షలు ఇచ్చారంటే?

Karimnagar: బట్టలు ఆరేసుకోడానికి రూ.200 కోట్లతో ఈ బ్రిడ్జి కట్టారా? ఇదెక్కడి మాస్ మామ!

Sujathakka Surrender: లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు సుజాతక్క

Big Stories

×