Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నటి సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాతగాను నటిగాను కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న సమంత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సమంత తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈమె మొబైల్ (Mobile)వాడకం గురించి మొబైల్ ఫోన్ కు తాను ఎంతలా అంకితం అయ్యాననే విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన జీవితంలో తాను ఎన్నో మార్పులు చేసుకున్నానని, తనని తాను మార్చుకున్నానని తెలియజేశారు.
మొబైల్ ఫోన్ కు అంకితం..
ఇలా నా జీవితంలో ఎన్నో మార్పులు చేసుకున్నప్పటికీ , నేను మాత్రం ఫోన్ వాడటాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని తెలిపారు. ఇలా ఈ విషయం నుంచి బయటపడటం కోసం తాను మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా గడిపానని సమంత తెలియచేశారు. ఈ మూడు రోజులు ఫోన్ లేకుండా ఎవరితో మాటలు లేకుండా, చదవడం, రాయడం వంటివి లేకుండా పూర్తిగా తాను విశ్రాంతి తీసుకున్నానని తెలిపారు. ఆ సమయంలోనే నా ఈగో ఫోన్ కి కనెక్ట్ అయిందని నేను గ్రహించాను. ఇది నాకు కళ్ళు తెరిపించిన అనుభవం అంటూ సమంత తెలియజేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ రాజ్ తో రిలేషన్?
ఇకపోతే సమంత ఇటీవల కాలంలో తరచూ సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈమె నటుడు నాగచైతన్య (Nagachaitanya)కు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అనంతరం మయోసైటిసిస్ వ్యాధికి గురి అవ్వడంతో కొద్దిరోజులపాటు సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అయిన సమంత ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరి(Raj Nidumori)తో కలిసి కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా ఈ వార్తలను మాత్రం వీరు ఖండించలేదు.
వెబ్ సిరీస్ లపై ఫోకస్..
ఈ క్రమంలోనే సమంత గురించి డైరెక్టర్ రాజ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ తమ పెళ్లి గురించి అధికారకంగా తెలియజేయబోతున్నారు అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.. ఇలా నిత్యం సమంత ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే ఇటీవల తన నిర్మాణ సంస్థలో శుభం అనే సినిమాను నిర్మించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక చివరిగా సమంత వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్ ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు ప్రస్తుతం ఈమె నెట్ ఫ్లిక్స్ కోసం రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సమంత చివరిగా ఖుషీ అనే సినిమా ద్వారా వెండితెరపై సందడి చేసిన సంగతి తెలిసిందే.
Also Read: U.V Creations: యు.వి. క్రియేషన్స్ పేరుతో ఫ్రాడ్ కాల్స్.. హీరోయిన్స్ టార్గెట్!