BigTV English

OTT Movie : ఆ ఒక్క రాశి పిల్లలు మాత్రమే మిస్సింగ్… ట్విస్టులతో మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఆ ఒక్క రాశి పిల్లలు మాత్రమే మిస్సింగ్… ట్విస్టులతో మెంటలెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఈ సినిమాలు థియేటర్లతో పాటు, ఓటీటీలో కూడా దూసుకుపోతున్నాయి. రీసెంట్ గా ఒక తమిళ మూవీ డిఫరెంట్ స్టోరీతో థియేటర్ లలోకి వచ్చింది. చిన్న పిల్లలనుమాయం చేసే ఒక ముఠాను, ఓ తండ్రి ఎదుర్కునే క్రమంలో ఈ స్టోరీ నడుస్తుంది. ఈ నెల చివరిలో, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.


జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో

ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘DNA’. 2025 లో వచ్చిన ఈ సినిమాకి నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించారు. ఇందులో అథర్వా మురళి మరియు నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలో విడుదలైంది. 140 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈసినిమాకి IMDb లో 8.0/10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న ఈ సినిమా, ఈ నెల చివరి వారంలో జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ కు రానుంది.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ ఆనంద్, దివ్య అనే ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అందరూ వీళ్ళని వేస్ట్ ఫెలోస్ లా చూస్తుంటారు. దానికి కారణాలు కూడా ఉంటాయి. ఆనంద్ ఒక లవ్ బ్రేక్ అప్ తర్వాత డ్రగ్ అడిక్ట్ గా మారుతాడు. ఇక పనీ పాట లేకుండా, తన బాధను పోగొట్టుకోవడానికి మత్తు పదార్థాలకి అలవాటు పడతాడు. మరో వైపు దివ్యకు బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంటుంది. దీనివల్ల ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదు. దీంతో ఆమె తల్లి కూడా ఆమెను భారంగా చూస్తుంటుంది. అయితే అనుకోకుండా వీళ్లిద్దరికి ఒక రోజు పెళ్ళి జరిగిపోతుంది. ఆతరువాత వీళ్ళ జీవితాలలో కొన్ని ఊహించని మలుపులు తిరుగుతాయి.

చూస్తుండగానే దివ్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కానీ డెలివరీ తర్వాత కొన్ని నిమిషాల్లోనే, తన బిడ్డను ఎవరో మార్చారని అనుమానిస్తుంది. ఆమె మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆమెను ఎవరూ నమ్మరు. ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ మహిమైయమ్మల్ ఆమె ఆరోపణలను పట్టించుకోడు. ఆనంద్ తన భార్య మాటలను నమ్మి, తన బిడ్డను కనిపెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. సబ్-ఇన్‌స్పెక్టర్ చిన్నసామి సహకారంతో ఆనంద్ ఒక DNA టెస్ట్ నిర్వహిస్తాడు. అయితే ఈ టెస్ట్ లో రిపోర్ట్ నెగిటివ్ గా వస్తుంది. ప్రస్తుతం ఉన్న బిడ్డ వారిది కాదని తెలుస్తుంది.

ఇక ఈ దర్యాప్తులో ఆనంద్, చిన్నసామిలకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. దీని వెనుక పిల్లలని ఎత్తుకుపోయే ముఠా ఉందని గుర్తిస్తారు. పిల్లల దొంగతనం ఒక క్రైమ్ రింగ్‌లో భాగమని, ఇది ఆసుపత్రులలో పిల్లలను మార్చడం ద్వారా నడుస్తుందని తెలుస్తుంది. ఈ కేసులో ముందుగా హాస్పిటల్ యాజమాన్యం మీద అనుమానాలు వస్తాయి. ఈ క్రమంలో ఆనంద్ ఒక డ్రగ్ అడిక్ట్ నుండి, బాధ్యత గల తండ్రిగా మారతాడు. ఇక ఆనంద్, చిన్నసామి ఈ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి కలిసి పనిచేస్తారు. చివరికి ఆనంద్ తన బిడ్డ ఎక్కడ ఉందో కనిపెడతాడా ? పిల్లలని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు ? దీని వెనుక ఎవరున్నారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలవసుకోవాల్సిందే.

Read Also : 16 ఏళ్ల బాలికకు 32 ఏళ్ల పిచ్చోడితో పెళ్లి… ఇలాంటి పిచ్చి వేషాలేస్తే ఇదే గతి

Related News

OTT Movie : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ

OTT Movie : భర్తను మస్కా కొట్టించే భార్య… సెల్లార్ లో దెయ్యాల మిస్టరీ… ఇది మామూలు స్టోరీ కదయ్యో

Baahubali Movie: షాకింగ్‌ న్యూస్‌.. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ‘బాహుబలి’ మూవీ తొలగింపు.. కారణమేంటంటే!

Tribanadhari Barbarik OTT: ఓటీటీలోకి ఉదయభాను కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఎక్కడంటే?

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Big Stories

×