Manchu Manoj Mirai Promotions: లాంగ్ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ తన రీఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్నాడు. వాట్ ద ఫిష్ అంటూ ఓ మూవీ ప్రకటించాడు. ఆ తర్వాత మూవీ ప్రకటించారు. కానీ అవి అనౌన్స్మెంట్స్తోనే ఆగిపోయాయి. ఆ తర్వాత ఈటీవీలో ఓ రియాలిటీ షో పేరుతో కాస్తా హడావుడి చేశాడు. అది కూడా మధ్యలోనే ఆగిపోయంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భైరవంలో ప్రధాన పాత్ర పోషించి.. మల్టీస్టారర్తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ, భైరవం మంచి టాక్ తెచ్చుకున్నప్పటికి కమర్షియల్ గా మాత్రం ఫెయిల్ అయ్యింది. దీంతో మనోజ్కు నిరాశ ఎదురైంది.
ఇప్పుడు మనోజ్ చేతిలో మిరాయ్ మూవీ ఉంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించబోతున్నాడు. ఇందులో పవర్ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. మిరాయ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మంచు మనోజ్.. అసలు మూవీ టీంతో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ప్రమోషన్స్లో ఎక్కడ కనిపించడం లేదు. ప్రస్తుతం మనోజ్‌కు మిరాయ్ ప్రమోషన్స్ చాలా ముఖ్యం. కారణంగా అతడు కెరీర్లోనే ఇది పెద్ద సినిమా. పైగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. ఇప్పటి వరకు మనోజ్కి తనని తాను ప్రూవ్ చేసుకునే టైం రాలేదు. రాక రాక మిరాయ్‌తో ఆ ఛాన్స్ వస్తే.. దాన్ని యూజ్ చేసుకోవడంలో మనోజ్ ఫెయిల్ అవుతున్నాడా? లేక మిరాయ్ టీం అతడిని పక్కన పెడుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. దీని కారణం..
ఇండస్ట్రీలో మనోజ్ డామినేటర్ అనే ముద్ర ఉంది. అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం మనోజ్. ప్రతి ఒక్కరితో కలిసిపోతుంటాడు. మూవీ ప్రమోషన్స్ వస్తే.. అక్కడ మొత్తం మనోజ్ సందడే కనిపిస్తుంది. మూవీ టీంలో ఎవరిని ఏం ప్రశ్నించిన.. మనోజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. భైరవంలో అదే కనిపించింది. ఇటీవల మిరాయ్ ప్రెస్ మీట్ మనోజ్ అందరిని డామినేట్ చేస్తూ కనిపించాడు. ప్రెస్ మీట్ హీరో, హీరోయిన్, దర్శక-నిర్మాతలు అడిగే ప్రశ్నలకు కూడా మనోజే సమాధానం ఇస్తూ కనిపించాడు. రెండు మైకులు ఉంటే మనోజ్ దగ్గరే ఒక మైక్ ఉంటుంది. మరో మైక్ టీం మొత్తానికి తిరుగుతుంది. జర్నలిస్టులు హీరోహీరోయిన్ల అడిగే ప్రశ్నలకు కూడా మనోజ్ కలగజేసుకుని మధ్యలో దూరిపోతున్నాడు. ఇలాగే ఉంటే పాన్ ఇండియా స్టేజ్ పై కూడా ఇదే రిపీట్ అవుతుందని మిరాయ్ టీం మనోజ్ ప్రమోషన్స్ దూరం పెడుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి.
మరోవైపు మనోజ్ ఎక్కడికి వె ళ్లిన సింగిల్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల వైజాగ్కి కేవలం ఫ్యామిలీతోనే వెళ్లి మిరాయ్ ప్రమోషన్ చేశాడు. కానీ, మిరాయ్ టీంతో కలిసి ఎక్కడ కనిపించడం లేదు. ఇదంత చూస్తుంటే.. మనోజ్‌ని మిరాయ్ టీం పక్కన పెడుతుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో మనోజ్ కీలక పాత్ర పోషించాడు. పైగా స్టార్ నటుడు. మనోజ్ తో ప్రమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ, ఎందుకు మంచు హీరో మాత్రం మిరాయ్ టీంతో కలవడం లేదు. మరి దీనికి కారణమేంటో తెలియదు కానీ, మనోజ్ దీన్ని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడనిపిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాత్రం మిరాయ్కి అన్ని భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెబుతున్నట్టు చెప్పాడు. మరి ఈ డబ్బింగ్ వర్క్ కోసం మనోజ్ ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నాడా? లేక మూవీ టీం మంచు హీరోని పక్కన పెడుతుందా అర్థం కావడం. కానీ, మనోజ్ మాత్రం మంచి అవకాశాన్ని వదులుకుంటున్నాడంటూ ఫ్యాన్స్, సినీవర్గాలు అభిప్రాయపడుతున్నారు.