E-Paper
Advertisement

నా అల్లుడు ఇమామ్ కు కెప్టెన్సీ ఇవ్వండి..లేక‌పోతే అంద‌రి చిట్టా విప్పుతా

నా అల్లుడు ఇమామ్ కు కెప్టెన్సీ ఇవ్వండి..లేక‌పోతే అంద‌రి చిట్టా విప్పుతా
Advertisement

Inzamam-ul-Haq:  పాకిస్తాన్ క్రికెట్ జట్టులో (Pakistan cricket team) కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తమ ప్లేయర్లను హిట్టర్లుగా మార్చేందుకు అమెరికాలో ట్రైనింగ్ ఇస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పరువు పోకుండా ఇంగ్లీష్ క్లాసులు కూడా ప్లేయర్లకు అందిస్తోంది. లాహోర్ లోని అకాడమీలో ప్రత్యేక క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ పదవిని భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది PCB. ఇందులో భాగంగానే బాబర్ ఆజం (babar azam) పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. షాన్ మసూద్ స్థానంలో బాబర్ ఆజం పేరు ఇప్పటికే ఫైనల్ అయినట్లు నివేదికలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-Haq). బాబర్ ఆజం కు కెప్టెన్సీ ఇస్తే దండగ అంటూ ఫైర్ అయ్యారు. బాబ‌ర్ కంటే, నా అల్లుడే బెటర్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నా అల్లుడు ఇమామ్ కు (Imam-ul-Haq ) కెప్టెన్సీ ఇవ్వండి..లేక‌పోతే అంద‌రి చిట్టా విప్పుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇంజ‌మామ్ ఉల్ హ‌క్.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

నా అల్లుడు ఇమామ్ కు కెప్టెన్సీ ఇవ్వండి..లేక‌పోతే అంద‌రి చిట్టా విప్పుతా

Advertisement

పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ గా బాబర్ ఆజం పేరు దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇంజమాం ఉల్ హక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం కంటే తన అల్లుడు ఇమామ్ ఉల్ హక్ ను కెప్టెన్ చేస్తే బాగుంటుందని వెల్లడించారు. చాలా రోజులుగా జట్టు కోసం తన అల్లుడు కష్టపడుతున్నాడని.. కెప్టెన్ కావాలని ఆశపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే అన్ని రకాల పదవులు అనుభవించిన బాబర్ ఆజం కు ఎందుకు కెప్టెన్సీ ఇస్తున్నారని నిలదీశారు. సోషల్ మీడియాలో బాబర్ ఆజం కు కెప్టెన్సీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని… ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉన్న సభ్యుల చిట్టా విప్పుతానని వార్నింగ్ ఇచ్చారు ఇంజమామ్. తన మాట విని నా మేనల్లుడు ఇమామ్ ఉల్ హక్ కు మర్యాదగా కెప్టెన్సీ ఇచ్చి… పక్కకు జరగండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ప్రకంపనలు చోటు చేసుకోవడం గ్యారెంటీ అని హెచ్చరించారు. దీంతో ఇంజమాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక అటు తనకు కెప్టెన్సీ ఇస్తే.. జట్టును అద్భుతంగా నడిపిస్తానని ఇమామ్ ఉల్ హక్ రెండు రోజుల కిందట వెల్లడించారు. ఈ క్రమంలోనే బాబర్ ఆజం పేరు తెరపైకి వచ్చింది. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

Related News

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

351 ప‌రుగులు చేసినా ఓడిపోతారా ? బౌల‌ర్ల‌నే కాదు, గిల్ ను కూడా పీకిపారేయండి

అంపైర్లు నిద్ర‌పోతున్నారా ? రూథ‌ర్ ఫోర్డ్ అస‌లు ఔటే కాదు…ఆకాశ్ చోప్రా సీరియ‌స్‌

ద‌మ్ముంటే నా బౌలింగ్ లో సిక్సులు కొట్టురా…అమీర్ జంగూతో సిరాజ్ గొడ‌వ‌

వైభ‌వ్ కు కాదు, నీకు జోల పాట పాడే టైం ద‌గ్గ‌ర ప‌డింది..సైమ్ సెల‌బ్రేష‌న్స్ పై క‌మ్రాన్ సీరియ‌స్

పాకిస్తాన్ క్రికెట్ లో అందరూ దద్దమ్మలే…PCB ఆఫ‌ర్ పై షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

6 సిక్సర్లు కొడతానని…బుమ్రా బౌలింగ్‌లో మూతి పళ్ళు రాలగొట్టుకున్న ఫర్హాన్

Big Stories

Advertisement
×