E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత..అసలు సంగతి ఇదే !

ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చిన సమంత..అసలు సంగతి ఇదే !
Advertisement

Samantha Pregnancy:  ఒకవైపు తన సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే , మరోవైపు తన వ్యక్తిగత జీవితంలో సరికొత్త చాప్టర్ మొదలెట్టేసింది సామ్ . అవును ఈ మధ్యే  విడుదలైన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో థియేటర్లలో పూనకాలు తెప్పించిన సమంత, ఇప్పుడు తన అభిమానులకు అంతకుమించిన డబుల్ బొనాంజా లాంటి తీపి కబురు అందించింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నాననే విషయాన్ని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రెగ్నెన్సీ కారణంగా సినిమాలకు  బ్రేక్

ఇవాళ ఘనంగా నిర్వహించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ వేదికగా సమంత స్వయంగా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తన జీవితంలో ఇది అత్యంత మధురమైన క్షణమని, అందుకే ఈ ఆనందాన్ని తనను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులతో పంచుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. అంతేకాదు, గర్భధారణ కారణంగా సినిమాలకు కొంతకాలం పాటు బ్రేక్ ఇస్తున్నానని, ఇప్పటి నుంచి మెటర్నిటీ లీవ్‌లోకి వెళ్తున్నట్లు వెల్లడించింది.

Advertisement

గతంలో ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఆ తర్వాత ‘శాకుంతలం’, ‘ఖుషి’ వంటి చిత్రాలతో అలరించింది. తాజాగా ‘మా ఇంటి బంగారం’తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో తన రూటే వేరని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆమె ఈ బ్రేక్ తీసుకోవడం గమనార్హం.

విషెస్ చెబుతున్న ప్రముఖులు 

నిజానికి గత కొన్ని రోజులుగా సమంత ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమె సాంప్రదాయ చీరకట్టులో మెరవడం, కాస్త బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకున్నారు. కొందరు ఇది కేవలం రూమర్ మాత్రమే అనుకున్నప్పటికీ, ఇవాళ సమంత స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలన్నింటికీ తెరపడింది. ఈ శుభవార్త విన్న టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు, సహ నటీనటులు సామ్‌కు సోషల్ మీడియా వేదికగా  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రాజ్ నిడిమోరును రెండవ వివాహం చేసుకున్న సామ్ 

Advertisement

ఇక సమంత వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. ఆమె గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును (రాజ్ అండ్ డికె లలో ఒకరు) రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక కేంద్రమైన ఇషా ఫౌండేషన్‌లో అత్యంత ఆత్మీయుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక చాలా సింపుల్‌గా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా, ఆ తర్వాత ప్రేమగా మారి ఇరు కుటుంబాల అంగీకారంతో వీరు ఒక్కటయ్యారు. వివాహబంధంలోకి అడుగుపెట్టిన కొన్ని నెలలకే ఈ జంట తమ జీవితంలోకి కొత్త అతిథిని ఆహ్వానించడానికి సిద్ధమవ్వడం విశేషం.

ఆసక్తిగా ఎదురుచూస్తున్న సామ్ ఫ్యాన్స్ 

మరోవైపు సమంత లీడ్ రోల్‌లో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం కొద్ది రోజుల్లోనే 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. సమంత నటన, ఎమోషన్స్ ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేశాయి. ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్, మరోవైపు నిజజీవితంలో మాతృత్వపు మధురిమలు.. ఇలా రెండు భారీ గుడ్ న్యూస్‌లు ఒకేసారి రావడంతో సమంత అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సామ్ మెటర్నిటీ లీవ్ ముగించుకుని, మరింత రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ వెండితెరపైకి ఎప్పుడు వస్తుందా అని అప్పుడే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సామ్ ఫ్యాన్స్ .

Related News

ఒకే ఫ్రేమ్‌లో మెగా పవర్…ఏపీ డిప్యూటీ సీఎంని కలిసిన గ్లోబల్ స్టార్!

చంద్రబాబును కలిసిన APSFTVTDC చైర్మన్.. టాలీవుడ్‌కు సరికొత్త బూస్టింగ్!

బోల్డ్ సబ్జెక్ట్‌తో సందీప్ కిషన్ ఫన్ రైడ్.. ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ అదిరిపోయిందిగా !

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. ఆ పరేషాన్ వెనుక 9 ఏళ్ల లవ్ స్టోరీ!

దర్శకుడంటే వీడ్రా బాబు..టాలీవుడ్‌కి క్లాస్ పీకుతున్న హాలీవుడ్ కుర్రోడు !

టాలీవుడ్ టు ఫ్రాన్స్.. ఇంటర్నేషనల్ వేదికపై ‘బాహుబలి’ గ్రాండ్ ఎంట్రీ

స్క్రీన్ పై నీతులు… స్క్రీన్ వెనుక కోతులు.. టాలీవుడ్ పై సింగర్ సునీత పంచ్

Big Stories

×