E-Paper
Advertisement

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!
Advertisement

Singeetham Srinivas Rao :ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సింగీతం శ్రీనివాస్ గారు ఇకలేరు అనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు అభిమానులు, అటు సెలబ్రిటీలు ఒక్కొక్కరు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 94 ఏళ్ళ వయసులో వయోభారంతో ఆయన చికిత్స పొందుతూ కన్నమూయడంతో ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది.ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. ఆయన అభిమానులు ఆయన కెరియర్లో తెరకెక్కించిన మరుపురాని చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు.

అప్రెంటిస్ ట్రైనీ నుండి స్టార్ డైరెక్టర్ వరకు..

1931 సెప్టెంబర్ 21న నెల్లూరు ఉదయగిరిలో జన్మించారు. ఈయన తండ్రి ఒక హెడ్ మాస్టర్ కాగా, తల్లి వయోలిన్ వాయిద్య నిపుణురాలు. మద్రాస్ రెసిడెన్సి కాలేజీలో చదివేటప్పుడే నాటక రంగంలో ప్రవేశించిన ఈయన ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారు. సినిమాలపై మక్కువతో డైరెక్టర్ కెవి రెడ్డి వద్ద అప్రెంటిస్ గా సినిమా ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈయన, ఆ తర్వాత దొంగ రాముడు, ఉమా చండీ గౌరీ శంకరుల కథ, జగదేకవీరుని కథ , మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం వంటి చిత్రాలకు అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేశారు.

ప్రయోగాత్మక చిత్రాలతో ఊహించని గుర్తింపు..

Advertisement

1972లో తొలిసారి తొలి తెలుగు చిత్రం నీతి నిజాయితీతోనే తనదైన ముద్ర వేసుకున్న ఈయన.. మయూరి ,ఆదిత్య 369 భైరవ ద్వీపం వంటి ఎన్నో చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచేశారు. ముఖ్యంగా పుష్పక విమానం అనే చిత్రంతో మూకీ సినిమా చేసిన ఈయన, ఆదిత్య 369 లో టైం మిషన్ ను వర్తకాలం నుండి భవిష్యత్తు కాలానికి తీసుకెళ్లడం వంటివి చేసి ఆకట్టుకున్నారు. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలోనే తొలి టైం ట్రావెల్ మూవీగా ఆదిత్య 369 నిలిచి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది వచ్చిన సింగ్ గీతం సినిమాతో పాటలనే మాటలుగా సినిమా చేయడం వంటి ఎన్నో ప్రయోగాలతో వెండితెరపై అద్భుతాలు సృష్టించారు.

సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తీసిన మయూరి కూడా సూపర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఏకంగా 14 నంది అవార్డులు సొంతం చేసుకుంది. భైరవద్వీపం సినిమాతో సంచలనం సృష్టించిన ఈయన.. నంది అవార్డును కూడా అందుకున్నారు. అలా తన సినీ ప్రయాణంలో 60కి పైగా సినిమాలు చేసి , సింగీతం అంటే ఒక ప్రయోగం అనే ఖ్యాతి అందుకున్నారు.

తెలుగు సినీ చరిత్రలో శాశ్వత చిరునామా..

Advertisement

ఆదిత్య 369, పుష్పక విమానం, విచిత్ర సోదరులు , మైఖేల్ మదన కామరాజు, భైరవ ద్వీపం, సింగ్ గీతం ఇలా ఎన్నో మరుపురాని చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తెలుగు సినీ చరిత్రలో శాశ్వత చిరునామాను సొంతం చేసుకున్నారు.

ALSO READ: బిగ్ బాస్ 10 నుండి సృష్టి ఎలిమినేటెడ్..4 వారాల్లో సంపాదించింది ఎంతంటే?

ప్రేక్షకుడి నాడీ తెలిసిన డైరెక్టర్..

అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. ప్రయోగాత్మక సినిమా అంటే కేవలం కొత్తగా చేయడం మాత్రమే కాదు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఆసక్తిగా అనిపించేలా చెప్పడం చాలా ముఖ్యమని తెలుసుకున్న డైరెక్టర్ .. అలా ప్రేక్షకుడి నాడి తెలిసిన ఈయన తన సినిమాలలో ఈ బ్యాలెన్స్ ను చక్కగా మెయింటైన్ చేస్తూ వచ్చారు. కొత్త కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. అందులో వినోదం, భావోద్వేగం, హాస్యం , కథనం వంటి అంశాలను కలిపి సాధారణ ప్రేక్షకుడికి కూడా కనెక్ట్ అయ్యేలా చేశారు . అలా ఈయన తీసిన ప్రతీ ప్రయోగాత్మక సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించి, అద్భుతమైన సక్సెస్ అందుకొని, ఆయనకు ఒక స్థానాన్ని కల్పించింది.

Related News

లగ్జరీ విల్లా కొనుగోలు చేసిన విరోష్ జంట.. ధర ఎంతంటే?

అరాచకం సృష్టిస్తున్న శర్వానంద్.. ‘భోగి’ టీజర్ ఎలా ఉందంటే?

చుట్టమల్లే వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన వర్మ.. అసలేం జరిగిందంటే?

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

సింగీతం సినిమాల గురించి.. నూటికో కోటికో ఒక్కరంటూ, నేటితరం దర్శకులు ఏమన్నారు?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

Big Stories

Advertisement
×