OTT Movie : సర్ప్రైజింగ్ ట్విస్టులు, ఊహించని మలుపులు వచ్చే థ్రిల్లర్ సినిమా, అందులోనూ మలయాళ థ్రిల్లర్ అయితే అదుర్స్ కదా. ఇలా అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.
జీ5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు ‘వోల్ఫ్’ (Wolf). ఇదొక మలయాళం సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్. ఒక యువకుడు తనకు కాబోయే భార్యను సర్‌ప్రైజ్ చేయడానికి వెళ్లినప్పుడు, కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా ఆమె ఇంట్లో చిక్కుకుని ఊహించని సమస్యలను ఎదుర్కొంటాడు. షాజి అజీజ్ దర్శకత్వంలో జి.ఆర్. ఇండుగోపన్ రాసిన “చెన్నాయ” అనే షార్ట్ స్టోరీ ఆధారంగా ఆకట్టుకుంటుంది. అయితే క్లైమాక్స్ 2021 ఏప్రిల్ 18న జీ కేరళం, జీ5 ప్లాట్‌ఫామ్‌లలో ఏకకాలంలో విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్ (సంజయ్), సంయుక్త మీనన్ (ఆశా), ఇర్షాద్, టామ్ చాకో, జాఫర్ ఇడుక్కి (సీఐ) తదితరులు. ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో జీ5, అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులో ఉంది. కానీ ఈ మూవీని ఓటీటీలో చూడాలంటే కొనాల్సి ఉంటుంది.
కథలోకి వెళ్తే…
కొచ్చిలో ఉండే సంజయ్ (అర్జున్ అశోకన్) ఒక కోపిష్టి యువకుడు. తనకు కాబోయే భార్య ఆశా (సంయుక్త మీనన్)ను ఆమె పరిప్పల్లిలోని ఇంట్లో సర్‌ప్రైజ్ చేయడానికి వెళ్తాడు. మరో రెండు వారాలలో ఈ జంట పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ ఆశా అతని రాకను చూసి ఆనందించదు. ఆమె తల్లి ఇంట్లో లేకపోవడంతో అతని రాక గాసిప్‌లకు కారణమవుతుందని భయపడుతుంది. సంజయ్ రాక, అతని ప్రవర్తన, మాటలు హీరోయిన్ కి అస్సలు నచ్చవు.
ఈ సందర్భంలో కోవిడ్-19 లాక్‌డౌన్ ను ఆకస్మికంగా ప్రకటిస్తారు. దీంతో సంజయ్ ఆశా ఇంట్లో ఆ రాత్రి గడవాల్సి వస్తుంది. ఇక హీరోయిన్ తల్లి విషయం తెలిసి, కూతురిని ఆ అబ్బాయికి దూరంగా ఉండమని చెబుతుంది. అంతేకాదు ఊరికే వీడియో కాల్స్ చేస్తూ టెన్షన్ పడుతుంది. ఈ క్రమంలోనే రాత్రిపూట విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో సంజయ్ లివింగ్ రూమ్ లోకి వెళ్లి చెక్ చేస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు.
Read Also : ప్రియుడితో కలిసి పెళ్ళికి ముందే ఆ పని… థ్రిల్లింగ్ ట్విస్టులతో నరాలు తెగే సస్పెన్స్… క్లైమాక్స్ డోంట్ మిస్
ఉదయం, ఆశా బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది. ఆ టైములో మళ్లీ ఒక శబ్దం వినిపిస్తుంది. ఈసారి రెండో అంతస్తు నుండి. ఆశా అక్కడకు వెళ్ళకూడదు అని చెప్పి లాక్ చేసిన గది నుండి వస్తుంది సౌండ్. సంజయ్ ఆమె చెప్పేది వినకుండా ఒక కర్రతో గదిని బలవంతంగా తెరిచి, అక్కడ ఒక వ్యక్తిని సిగరెట్ తాగుతూ ఉండడాన్ని చూస్తాడు. ఇక్కడే స్టోరీ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ ఆ రూమ్ లో ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ రూమ్ లో వేసి లాక్ చేశారు? చివరికి హీరోయిన్ పెళ్లి జరిగిందా ? లేక ఆగిపోయిందా? అన్నది తెరపై చూడాల్సిన కథ.