BigTV English

SSMB 29: మహేష్ బర్తడే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న!

SSMB 29: మహేష్ బర్తడే స్పెషల్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న!

SSMB 29:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈరోజు 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కెరీర్లో మైల్ స్టోన్ గా నిలిచిన కొన్ని చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా.. అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానుల ఎదురుచూపుకు తెర దించుతూ రాజమౌళి (Rajamouli) ఊహించని అప్డేట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.


మహేష్ బర్తడే స్పెషల్..

ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఆఫ్రికన్ అడ్వెంచర్ ఆక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకపోవడం గమనార్హం. మహేష్ బాబు బర్తడే సందర్భంగా అయినా అప్డేట్ వస్తుందనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని చెప్పడంతో నిరాశ వ్యక్తం చేశారు. కానీ మహేష్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇస్తూ రాజమౌళి ఎక్స్ వేదికగా ఒక నోట్ పంచుకున్నారు.


గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఇచ్చిన రాజమౌళి..

అందులో రాజమౌళి.. “ప్రపంచ సినీ ప్రేమికులారా.. మహేష్ అభిమానులారా..మహేష్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయ్యింది. ఈ సినిమా గురించి తెలుసుకోవాలనే మీ ఆసక్తిని మేము అభినందిస్తున్నాము. అయితే ఈ సినిమా కథ, దాని పరిధి చాలా విస్తృతమైంది. కేవలం ఫోటోలు, ప్రెస్ మీట్లతో న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను.పైగా మహేష్ బాబుతో నేను సృష్టిస్తున్న ఈ ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఇది సరిపోదు. మీకు ఒక గొప్ప అనుభూతిని పంచడానికి కష్టపడుతున్నాను. నవంబర్ 2025లో ఖచ్చితంగా ఈ సినిమా నుంచి ఎవరూ.. ఎప్పుడూ చూడని విధంగా ఒక పెద్ద అప్డేట్ తో మీ ముందుకు రాబోతున్నాను.. మీ సహనానికి ధన్యవాదాలు” అంటూ రాజమౌళి తెలిపారు. ఇక మొత్తానికైతే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్లో ఈ సినిమా నుంచి అప్డేట్ వదులుతానని హైప్ పెంచేసి.. గూస్ బంప్స్ తెప్పించేలా కామెంట్ చేశారు రాజమౌళి.

మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్..

దీంతోపాటు మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా ఆయన షేర్ చేసుకున్నారు. ఇందులో మహేష్ బాబు ముఖం కనిపించకుండా డీప్ V నెక్ కలిగిన షర్టు ధరించినట్టు చూపించారు. పైగా మెడలో పూసలతో తయారుచేసిన దండ ఉండగా.. ఆ దండలో ఉన్న లాకెట్ అందర్నీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా నంది.. దానిపైన ఢమరుకం.. దానిపైన త్రిశూలం.. దానిపైన శివుడి నామాలు.. ఇలా మహాశివుడికి సంబంధించిన ఆయుధాలతో ఆ లాకెట్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ లాకెట్ ని మహేష్ బాబు వేసుకున్నట్లు ఆ లుక్ ని రాజమౌళి తాజాగా తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ ఒక్క పోస్టర్ ఇప్పుడు అంచనాలను అమాంతం పెంచేస్తోందని చెప్పవచ్చు.

ALSO READ:War 2 : వార్ 2 రన్ టైమ్ లాక్.. ఆ సీన్స్ తెలుగు నుండి తీసేసారా? 

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×