BigTV English

Hari Hara Veera Mallu: అసురహననం.. పవన్ ఫైర్ కి స్క్రీన్ తగలబడిపోద్ది.. వీరమల్లుపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

Hari Hara Veera Mallu: అసురహననం.. పవన్ ఫైర్ కి స్క్రీన్ తగలబడిపోద్ది.. వీరమల్లుపై సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

Sandeep Reddy Vanga Comments Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. జూలై 24న వరల్డ్ వైడ్ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు బయ్యర్ల కొరత అలాగే ఉంది. కానీ, నిర్మాత ఏఏమ్ రత్నం మాత్రం ధైర్యం చేసి కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఓ వైపు బయ్యర్ల, డిస్టిబ్యూటర్ల సమస్య అలాగే ఉంది.. కానీ, మరోవైపు ఈ సినిమా బజ్ మాత్రం అంచనాలను మించుతోంది. రోజురోజుకు మూవీపై హైప్ పెరుగుతుంది.


ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు

ట్రైలర్ తో ఒక్కసారిగి వీరమల్లుపై అంచాలు అమాంత పెరిగిపోయాయి. పవన్ యాక్షన్, ఇంటెన్స్ లుక్ ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసును దున్నేయడం పక్కా అంటూ కాలర్ ఎగిరేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ మూవీపై మరింత హైప్ పెంచుతున్నాయి. ఇటీవల ఈ చిత్రం నుంచి అసుర హననం పాట విడుదలైన సంగతి తెలిసిందే. యుద్దం బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ సాగింది. అందులో పవన్ పవర్ఫుల్ యాక్షన్ సీన్ లో దిగాడు.


అసురహననం.. గూస్ బంప్స్

ఎంఎం కీరవాణి ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ పాటను నెక్ట్స్ లెవెల్ కు తీసుకుంది. పాట మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. తాజాగా ఈ పాటను, హరి హర వీరమల్లు సినిమాపై సందీప్ రెడ్డి వంగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయనకు వీరమల్లు మూవీపై ప్రశ్న ఎదురైంది. ‘పవన్ కళ్యాణ్ సార్ నటిస్తున్న కొత్త సినిమా హరి హర వీరమల్లు. నేను ఈ సినిమా గురించి విన్నాను. మొదటి సారి ఆయన పీరియాడికల్ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అసురహననం లిరికల్ సాంగ్ చూశాను. ఇందులో పవన్ సార్ లుక్, యాక్షన్ చాలా ఇంటెన్స్ కనిపించింది.

స్క్రీన్ లు తగలడిపోతాయి..

విడుదల తర్వాత ఈ మూవీ పెద్ద విజయం సాధిస్తుంది.ముఖ్యంగా అసుర హననం పాట, పవన్ స్టార్ ఫైర్ థియటేర్ల స్క్రీన్ ని తగలబెడుతుందనడంలో సందేహం. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ మూవీ బజ్ ను అమాంతం పెంచేస్తున్నాయి. కాగా క్రిష్ జాగర్లమూడీ, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవన్ 16వ శతాబ్ధపు పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాను హరి హర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతికథానాయకుడిగా నటిస్తున్నారు.

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×