BigTV English

Jos Buttler: టీమిండియా బలుపు వల్లే.. లార్డ్స్ లో ఓడిపోయారు

Jos Buttler: టీమిండియా బలుపు వల్లే.. లార్డ్స్ లో ఓడిపోయారు

Jos Buttler: అండర్సన్ – సచిన్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ నేపథ్యంలో లార్డ్స్ వేదికగా జరిగిన మూడవ టెస్ట్ లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మూడవ టెస్ట్ లో విజయానికి ఎంతో చేరువగా వచ్చినా.. చివరకు ఓటమి పలకరించింది.


Also Read: Ind vs eng test series: సుందర్, కరుణ్, నితీష్ లను ఇండియాకు పంపించిన బీసీసీఐ.. స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ

ఐదవరోజు భారత్ ఆరు వికెట్లను చేతిలో పెట్టుకుని మరో 135 పరుగులు చేయాల్సిన సమయంలో విఫలమైంది. ఆశలు పెట్టుకున్న రిషబ్ పంత్, కే.ఎల్ రాహుల్ విఫలం కాగా.. 82/7 నుండి భారత జట్టును గెలిపించేందుకు రవీంద్ర జడేజా పోరాడిన లాభం లేక పోయింది. ఈ 3వ టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపుతో.. 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 తో ఆదిక్యంలో నిలిచింది.


జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు:

ఈ మూడవ టెస్ట్ లో భారత్ ఓటమికి ప్రధాన కారణం భారత టాప్ ఆర్డర్ వైఫల్యం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్ చేసిన వ్యాఖ్యలే భారత ఓటమికి మూల కారణమని బట్లర్ అభిప్రాయపడ్డాడు. నాలుగవ రోజు ఆట ముగిసిన అనంతరం స్కై స్పోర్ట్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాషింగ్టన్ సుందర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడవ టెస్ట్ లో నాలుగవ రోజు నాలుగు వికెట్లతో చెలరేగిన వాషింగ్టన్ సుందర్.. నాలుగవ రోజు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ” ఈ మ్యాచ్ లో భారత్ సునాయసంగా విజయం సాధిస్తుంది. ఐదవ రోజు లంచ్ తరువాతే భారత విజయం పూర్తవుతుంది. మాకు సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది” అని అన్నాడు వాషింగ్టన్ సుందర్.

ఇంగ్లాండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టిన సుందర్:

ఇలా వాషింగ్టన్ సుందర్ చేసిన వ్యాఖ్యలే ఇంగ్లాండ్ ఆటగాళ్లను రెచ్చగొట్టాలని చెప్పుకొచ్చాడు జోస్ బట్లర్. ఈ మేరకు బట్లర్ మాట్లాడుతూ.. ” వాషింగ్టన్ సుందర్ వ్యాఖ్యలు చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ప్రేరేపించాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసిని వాళ్లలో కలిగించాయి. సుందర్ కామెంట్స్ గురించి విన్న తర్వాత అతడు నిజంగానే ఇలా అన్నాడా..? అనిపించింది. టీమిండియా విజయం సాధిస్తుంది. మేం ఆదిక్యం సాధిస్తామని ఎంతో నమ్మకంతో సుందర్ అనడం వీడియోలో కనిపించింది.

బహుశా అతడు పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశాడేమోనని అనుకున్నాను. గెలవాలని ఆశిస్తున్నానని చెప్పబోయిన సుందర్.. గెలుస్తామని తప్పుగా పలికాడని భావించాను. అయితే ఈ వీడియోని ఎవరో ఒకరు ఇంగ్లాండ్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ లో చూపించి ఉంటారు. సుందర్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీ నుండి మెక్ కలమ్ సైగలు చేస్తూ.. ” ఎక్కువగా మాట్లాడింది ఇతడే. మన సత్తా ఏంటో చూపించండి” అన్నట్లుగా సైగలు చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం తన వ్యాఖ్యల పట్ల వాషింగ్టన్ సుందర్ పశ్చాతాపానికి గురై ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు బట్లర్.

Also Read: Bahubali – Cricketers: బాహుబలి పాత్రల్లో టీమిండియా ప్లేయర్లు… కట్టప్ప ఎవరంటే?

అయితే మ్యాచ్ సందర్భంగా ప్లేయర్స్ మధ్య స్లెడ్జింగ్ కొత్తేమీ కాదు. ఇది ఆటలో ఓ భాగంగా మారిపోయింది. కానీ ఇది కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అవతలి జట్టును రెచ్చగొట్టడం ద్వారా వారి ఆట తీరును ప్రభావితం చేయాలని అనుకుంటారు. కానీ ఇది ఒక్కోసారి తమకే బూమరాంగ్ కావచ్చు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ చేసిన వ్యాఖ్యలతో సరిగ్గా ఇదే జరిగిందని ప్రస్తుతం క్రీడాభిమానులు చర్చించుకుంటున్నారు.

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×