E-Paper
Advertisement

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!

తనకు ఎవరూలేరని బాధపడిన వరుడు.. పెళ్లికి 10 వేల మంది అతిథులు సర్‌ప్రైజ్!
Advertisement

Chinese viral wedding: చిన్నప్పుడు తండ్రిని కోల్పోయాడు.. అమ్మమ్మ కూడా దూరమైంది. బంధువులు ఎక్కువగా లేకపోవడంతో తన పెళ్లికి అతిథులు కూడా తక్కువగా వస్తారని ఓ యువకుడు బాధపడ్డాడు. అయితే, అతడు  తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఊహించని అద్భుతానికి దారితీసింది. సోషల్ మీడియా ఫ్రెండ్స్ ను తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఆయన పిలుపుతో ఏకంగా 10 వేల మందికి పైగా హాజరయ్యారు. వచ్చేటప్పుడు ఫుడ్ తోపాటు, అదిరిపోయే గిఫ్ట్స్ తీసుకొచ్చారు. అంతేకాదు, పెళ్లి ఏర్పాట్లలోనూ పాలుపంచుకున్నారు. చివరకు ఈ పెళ్లిలో  మేబాక్ కారు కూడా బహుమతిగా వచ్చింది. చైనాలో జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్ననాటి నుంచే కష్టాలు.. బంధువులు తక్కువ!

చైనాలోని యునాన్ ప్రావిన్స్, యిలియాంగ్ కౌంటీకి చెందిన 24 ఏళ్ల జు చెంగ్‌హాంగ్‌కు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. అతడికి మూడేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. తల్లి మరో వివాహం చేసుకోవడంతో, తన అన్నయ్యతో కలిసి పెరిగాడు. వారిని చూసుకున్న అమ్మమ్మ కూడా కొంతకాలం తర్వాత మరణించారు. తన కష్టార్జితంతో పెళ్లి కోసం 1,67,500 యువాన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.20 లక్షలకు పైగా) పొదుపు చేశాడు. ఈ నేపథ్యంలో తన పెళ్లికి బంధులు కూడా తక్కువగానే వస్తారని జు భావించాడు.

సోషల్ మీడియాలో ఆహ్వానం

Advertisement

తన పెళ్లికి ఎక్కువ మంది రావాలనే ఉద్దేశంతో అక్టోబర్ 25న చైనాకు చెందిన డౌయిన్ ప్లాట్‌ ఫామ్‌ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. తన కుటుంబ పరిస్థితిని వివరిస్తూ, తన పెళ్లికి వచ్చి కలిసి భోజనం చేసి వేడుకను ఆనందంగా మార్చాలని  కోరాడు. అయితే, అతడి ఆహ్వానానికి ఇంత పెద్ద స్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు. చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పెళ్లికి వస్తామని చెప్పారు. కొందరు పూలు, మరికొందరు బహుమతులు, ఇంకొందరు ఫుడ్  తీసుకొస్తామని చెప్పగా, మరికొందరు వంటలు చేయడానికి, ఏర్పాట్లు చూసుకోవడానికి ముందుకొచ్చారు.

 బెంజ్ కారుతో పాటు పెద్ద మొత్తంలో బహుమతులు   

అతిథుల సంఖ్య పెరుగుతుండటంతో జు ఇంట్లో వేడుక నిర్వహించడం సాధ్యం కాలేదు. దీంతో స్థానిక అధికారులు పెద్ద వేదికకు మార్చేందుకు సహకరించారు. కొందరు పెళ్లి డెకొరేషన్ చేయగా, మరికొందరు వంటలు, ఇతర ఏర్పాట్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నూతన వధూవరులకు బెంజ్ మేబాక్ కారును బహుమతిగా ఇచ్చారు.

10 వేల మందికి పైగా హాజరు.. వీడియోలు వైరల్

Advertisement

అక్టోబర్ 31న జు తన ప్రేయసి చుయిచుయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు 10 వేల మందికి పైగా హాజరైనట్లు తెలుస్తోంది. నూతన వధూవరులు ఉంగరాలు మార్చుకుని అతిథుల ముందు నమస్కరించారు. అనంతరం సంప్రదాయ మియావో దుస్తులు ధరించి, మంటల చుట్టూ నృత్యాలు చేస్తూ వేడుకను జరుపుకున్నారు. అతిథులు నగదు బహుమతులు ఇవ్వవద్దని జు ముందుగానే కోరాడు. అందరూ క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

ఏదేమైనా, రక్తసంబంధం లేకపోయినా ఆప్యాయతతో ఒకరి వేడుకలో మరొకరు భాగస్వాములు కావచ్చని ఈ ఘటన నిరూపించింది. ఒంటరిగా మిగిలిపోతానని భయపడిన ఓ యువకుడి పెళ్లిని వేలాది మంది అనుకోని అతిథులు జీవితాంతం గుర్తుండిపోయే వేడుకగా మార్చారు.

Read Also: మా దేశానికి రండి మా పౌరులను ప్రేమించండి.. లవ్ చేయాలనుకునేవారికి ఉచిత ఫారిన్ ట్రిప్..

Tags

Related News

రైళ్లలో స్లీపర్ కోచ్ ప్రయాణికులకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు!

ఈశాన్య భారతానికి బుల్లెట్ రైలు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

భారత్-పాక్ సరిహద్దులో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు.. పలు రైళ్లు రద్దు!

జస్ట్ 100 మీటర్ల లింక్ రోడ్డు కోసం.. రోడ్డెక్కిన నల్లగొండ మాజీ ఎమ్మెల్యే!

ఆకాశం నుంచి మాంసం ముక్కల వాన.. భయంతో జనాలు పరుగులు, ఎక్కడంటే?

రైలులో దొంగల బీభత్సం.. ఏకంగా ఫస్ట్ ఏసీ కోచ్‌లోనే చోరీ.. రూ.2.5 లక్షల బంగారం మాయం!

తెలంగాణ, ఏపీ ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్.. దీపావళి రద్దీకి ప్రత్యేక రైళ్లు!

Big Stories

Advertisement
×